Jun 28,2023 20:20

గోడ పత్రికలు విడుదల చేస్తున్న రైతు సంఘం నాయకులు

ప్రజాశక్తి - ఆస్పరి
గతేడాది ఖరీఫ్‌లో పంట నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం, పంట బీమా విడుదల చేసి ఆదుకోవాలని రైతుసంఘం మండల అధ్యక్ష, కార్యదర్శులు మధు రెడ్డి, రంగస్వామిలు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. బుధవారం చలో విజయవాడ గోడపత్రికలను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. వేదవతి ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేసి నీటి సామర్థ్యాన్ని 8 టిఎంసిలకు పెంచాలని పేర్కొన్నారు. నీటి సామర్థ్యం పెంచితే ఆలూరు నియోజకవ్గంలోని గ్రామాలకు సాగు, తాగునీరు అందించవచ్చని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వెళ్లాలంటే ఇబ్బదులు పడాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. అనంతరం ఈనెల 30న రైతుసంఘం అధ్వర్యంలో నిర్వహించే చలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని గోడ పత్రికులు విడుదల చేశారు. మండల నాయకులు బాలకృష్ణ, మనోహర్‌, కౌలుట్లయ్య, రామాంజనేయులు, వీరాంజి, అంజి పాల్గొన్నారు.