May 09,2023 21:51

ప్రజాశక్తి - భీమడోలు
         అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ టిడిపి నేతలు భీమడోలు తహశీల్దార్‌ కార్యాలయం వద్ద మంగళవారం నిరసన కార్యక్రమాలను చేపట్టారు. దీనిలో భాగంగా కార్యాలయం ఎదుట బైఠాయించారు. కార్యక్రమానికి నాయకత్వం వహించిన టిడిపి ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు మాట్లాడుతూ ఆకాల వర్షాల వల్ల వరితో పాటు ఉద్యానవన పంటలు, పండ్ల తోటలు, ఇతర పంటలకు నష్టం వాటిల్లిందని తెలిపారు. ప్రభుత్వం పంట నష్టపోయిన రైతులకు పూర్తిస్థాయిలో నష్టపరిహారం చెల్లించాలని కోరారు. తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం తహశీల్దార్‌ షంషుద్దీన్‌కు వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల శాఖ అధ్యక్షులు సిరిబత్తిన కొండబాబు, డి.పుల్లయ్యనాయుడు పాల్గొన్నారు.
          టి.నరసాపురం : పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతూ టిడిపి ఆధ్వర్యంలో తహశీల్దార్‌ జెవి.సుబ్బారావుకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు పండించిన ఆహార, వాణిజ్య పంటలకు తీవ్ర నష్టం జరిగిందన్నారు. నష్టపోయిన రైతులు ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శులు శీలం వెంకటేశ్వరరావు, జయ్యవరపు శ్రీరామ్మూర్తి, నాయుడు రామకృష్ణారావు గౌడ్‌, ఆచంట సూర్యనారాయణ, సందేపూడి సాయి పాల్గొన్నారు.
చింతలపూడి : చింతలపూడి తహశీల్దార్‌ కృష్ణ జ్యోతికి జిల్లా పార్లమెంటరీ రైతు అధ్యక్షులు గుత్తా వెంకటే శ్వరరావు ఆధ్వర్యంలో వినతిపత్రం అందించారు. ఈ సంద ర్భంగా టిడిపి నేతలు మాట్లాడుతూ రైతులకు మద్దతు ధర కల్పిం చాలని, నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి చింతలపూడి టౌన్‌ అధ్యక్షులు పక్కాల వెంకటేశ్వరరావు, రైతు నాయకులు, మాజీ మండల ప్రెసిడెంట్‌ ఆది జగన్‌, సీనియర్‌ నాయకులు రాజారెడ్డి, రైతు నాయకులు చేకూరి అంకమరావు, తెలుగు యువత టౌన్‌ అధ్యక్షులు నత్త రవికుమార్‌, బిసి నాయకులు సత్యనారాయణ పాల్గొన్నారు.
            ఉంగుటూరు : నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం చెల్లించాలని, గోనె సంచులు ఇవ్వాలని కోరుతూ టిడిపి నేతలు తహశీల్దార్‌కు వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా యువత అధ్యక్షులు రెడ్డి సూర్యచం ద్రరావు, మండల అధ్యక్ష కార్యదర్శి పాతూరి విజరు, నల్ల ఆనంద్‌, కడియాల రవిశంకర్‌, మారిశెట్టి ప్రసాద్‌, నారాయణ పురం సర్పంచి దిడ్ల అలకనంద శ్రీనివాస్‌, యాళ్ల సుజీవరావు, ఇమ్మని గంగాధర్‌, బొమ్మిడి అప్పారావు పాల్గొన్నారు.
             పోలవరం : అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని టిడిపి సీనియర్‌ నాయకులు, ఎఎంసి మాజీ వైస్‌ ఛైర్మన్‌ కుంచే దొరబాబు డిమాండ్‌ చేశారు. టిడిపి మండల అధ్యక్షులు బొడ్డు కృష్ణ ఆధ్వర్యంలో తహశీల్దార్‌ కార్యాలయం వద్ద నిరసన తెలిపి తహశీల్దార్‌ బి.సుమతికి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా దొరబాబు మాట్లాడుతూ పిడుగుపాటుకు మృతి చెందిన కుటుంబాలకు పరిహారాలు చెల్లించాలని కోరారు.