May 05,2023 21:22

చంద్రబాబుతో మాట్లాడుతున్న జ్యోతుల

ప్రజాశక్తి - జగ్గంపేట
మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తూర్పుగోదావరి పశ్చిమగోదావరి జిల్లాలో నష్టపోయిన వరి సాగు రైతులు పరామర్శించడంప ఆంక్షలు విధించడం సరికాదని జగ్గంపేట మాజీ ఎంఎల్‌, టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జ్యోతుల నెహ్రూ అన్నారు తూర్పుగోదావరి జిల్లాలోని నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.30 వేలు ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు. రైతులను పరామర్శిస్తుంటే పోలీసులు వైసిపి కార్యకర్తల వలె ప్రవర్తిం చడం సరికాదన్నారు
రైతుల ఇబ్బందులపై చంద్రబాబుకు వినతి
తాళ్లరేవు: ప్రస్తుత ప్రభుత్వం లో రైతులు పడుతున్న ఇబ్బందులపై తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకి వినతిపత్రం అందజేసినట్లు ధూళిపూడి వెంకటరమణ (బాబి) తెలిపారు.అకాల వర్షాలు కారణంగా రైతులు పడుతున్న ఇబ్బందులు తెలుసుకునేందుకు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో భాగంగా ద్రాక్షారామ మండలం వేగా యమ్మ పేటలో పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వినతిపత్రం అందించా మని బాబీ అన్నారు. రైతు నాయకులు మట్టా ప్రభాకర్‌, ఆకుల రామకష్ణ, ముమ్మిడివరం నియోజకవర్గం ఇంచార్జి దాట్ల సుబ్బరాజు, గుత్తుల సాయి తదితరులు పాల్గొన్నారు.