
రామసముద్రం : గతంలో కిలో బంతి పూలు రకాలు ఏకంగా 40 నుండి 50 రూపాయలు పలకడంతో రైతు కళ్ళల్లో ఆశలు చిగురించాయి. అప్పుల ఊబిలో నుండి గట్టెక్కినట్లే అనుకుంటున్న తరుణంలో మూలిగే నక్కపై తాటికాయ పడినట్టు కిలో బంతిపూలు ధరలు అమాంతంగా రూ.5 కు పడిపోవడంతో పెట్టుబడులు వచ్చే పరిస్థితిలేదని ఆందోళన చెందుతున్నారు. మండలంలో చెంబకూరు, కాప్పల్లి, పెద్దకురప్పల్లి, ఎలకపల్లి, కమ్మవారిపల్లి, నారిగానిపల్లి, రామస ముద్రం, చొక్కాండ్లపల్లి, ఊలపాడు,మాలేనత్తం, మూగవాడి, కుదురు చీమ నపల్లి, అరికెల, కురిజల, ఎలువనెల్లూరు, ఆర్.నడింపల్లి, మినికి, రాగిమా కులపల్లి పంచాయతిలలో రైతులు బంతిపూలు సాగు చేశారు. రైతు ఆశిం చిన స్థాయిలో గిట్టుబాటు ధరలు లేక పూల రైతులు విలవిలా డుతు న్నారు. పెట్టుబడులకు, కూలీలకు వేలకువేలు ఖర్చు చేస్తుంటే కనీసం పెట్టు బడులు కూడా రాని పరిస్థితి ఏర్పడింది. కొందరు రైతులకు, పూల తోటలు కొన్న వ్యాపారస్తులకు కనీసం రవాణా ఖర్చులు కూడా రాకపో వడంతో పూలను తోటల్లోనే వదిలేసే పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం పూల రైతుల పరిస్థితి దయ నీయంగా మారింది. ఇది రామసముద్రం మండలం లోని పూలు సాగు చేస్తున్న రైతుల పరిస్థితి. మండలంలోని రైతన్నలు బిగ్ బాల్ , శ్రీలక్ష్మి, బిగ్ బాల్ ప్లస్, జర్మన్, హాస్టల్, శిల్పర్, గులాబీ, చాందిని, రూబిస్టార్ టైగర్, తది తర పంటలను సాగు చేస్తున్నారు. పూల సాగుకు ఎకరాకు రూ. 50 వేలు పెట్టుబడి అవసరం. విత్తనాలు కిలో రూ.3వేలు, అవుతుంది. కొందరు రైతులు నర్సరీలు నుండి ఒక్కో పూల మొక్క మూడు రూపాయలు వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు. నేల ఉబ్బిడి, వాతావరణం అనుకూలిస్తే దాదాపు రెండు నెలలు పూలు పూస్తాయి. పెళ్లిళ్ల సమయంలో కిలో పూలు రూ.30 నుంచి 40 వరకు వ్యాపారస్తులు కొనే వారు. దీంతో రైతుకు గిట్టు బాటు ధరలు అందేవి. ప్రస్తుతం కిలో పూలు రూ. 7 పలుకుతోంది. కనీసం కూలీల ఖర్చులకు కూడా రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెళ్లిళ్లు, పూజలు కొన్ని ప్రత్యేక సందర్భాలలో పూలకు మంచి గిరాకీ ఉంటుంది. కానీ పూలను కోయించేందుకు రోజుకు ఒక్కొక్కరికీ రూ.250 రూపాయలు కూలీ ఇవాల్సి ఉంది. ఉదయం 7 నుండి 11 గంటల వరకు , మధ్యాహ్నం12 నుంచి 3 గంటలవరకు సాయంత్రం 3 నుండి 6 గంటలవరకు రోజుకు మూడు దశల్లో పూలు కోయిస్తున్నారు. సుదూర ప్రాంతాలకు తరలించడానికి కనీసం రవాణా ఖర్చులు రాకపోవడంతో మదనపల్లి, చింతామణి, బెంగళూరు మార్కెట్లకు తరలిస్తున్నారు. మరికొందరు రైతులు పూలను తోట ల్లోనే వదిలేస్తున్నారు. ప్రభుత్వం బంతి రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించే చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.సాగులో ఉన్న బంతిపూలతోట