Nov 02,2023 22:27

ప్రజాశక్తి - గోకవరం మండలంలోని తంటికొండ గ్రామానికి చెందిన నియోజకవర్గ ఎస్‌సి సెల్‌ కార్యదర్శి పల్లా నరసయ్య కుటుంబాన్ని మాజీ ఎంఎల్‌ఎ జ్యోతుల నెహ్రూ గురువారం పరామర్శించారు. ఇటీవల కాలంలో నరస్య్య మృతి చెందారు. ఈ నేపథ్యంలోనే జ్యోతుల నెహ్రూ తంటికొండలోని నరసయ్య స్వగృహానికి వచ్చి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సందర్భంగా నర్సయ్య కుటుంబీకులు పల్లా రాజేష్‌, పల్లా సురేష్‌, పల్లా నరేష్‌లకు ధైర్యాన్ని చెప్పారు. ఈ సందర్భ:గా నెహ్రూ మాట్లాడుతూ ఫిషర్‌మెన్‌ సొసైటీ ఛైర్మన్‌గా, తంటికొండ సొసైటి డైరెక్టర్‌గా, పంచాయితీ వార్డు సభ్యుడిగా, టిడిపి ఎస్‌సి సెల్‌ కార్యదర్శిగా ప్రజలకు, తెలుగుదేశం పార్టీకి ఆయన చేసిన సేవలు మరువలేమన్నారు. పరామర్శించిన వారిలో టిడిపి నాయకులు బి.అచ్చన్న దొర, బి.బాబి, డి. తమ్మనదొర, జి.శివ ప్రసాద్‌, ఇ.అశోక్‌, బి.రవి పాల్గొన్నారు.