
ప్రజాశక్తి - కడియం ఇటీవల పద్మశ్రీ అవార్డు అందుకున్న సంకురాత్రి ఫౌండేషన్ అధినేత, కిరణ్ కంటి హాస్పిటల్ డాక్టర్ సంక్రాంతి చంద్రశేఖర్ శనివారం కడియపులంక శ్రీ సత్యదేవా నర్సరీని సందర్శించారు. ఆయనకు నర్సరీ యాజమాన్యం పుల్లా ఆంజనేయులు, పుల్లా వీరబాబు, పుల్లా రాజశేఖర్‌లు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్‌కు సన్మానపత్రం అందజేసి చిరు సత్కారం చేశారు. పుల్లా ఆంజనేయులు మాట్లాడుతూ పద్మశ్రీ సంక్రాంతి చంద్రశేఖర్ రాక నర్సరీకి ఎంతో ఆనందదాయకమన్నారు. చంద్రశేఖర్ మాట్లాడుతూ తొందరలోనే నర్సరీ రైతులందరి కోసం ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేస్తామన్నారు. ఆయన రచించిన ఆశా కిరణం పుస్తకాన్ని నర్సరీ యాజమాన్యానికి అందజేశారు. ఈ కార్యక్రమంలో నీలకంఠ మాస్టారు, బి.వెంకట్రావు, బి.సత్యనారాయణ, పిండి మూర్తి, పాల్గొన్నారు.