షెడ్డు నెట్ నర్సరీలను పరిశీలిస్తున్న జిల్లా ఉద్యాన శాఖ అధికారి జెన్నమ్మ
ప్రజాశక్తి-అద్దంకి: నర్సరీ యాజమాన్యాల వారు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్లు చేయించుకుని లైసెన్సులను పొందాలని జిల్లా ఉద్యానవన శాఖ అధికారి పి జెన్నెమ్మ అన్నారు. గురువారం మండలంలోని చిన్న కొత్తపల్లి, సింగరకొండపాలెంలోని షెడ్ నర్సరీలను ఉద్యాన అధి కారి ఎస్ దీప్తితో కలిసి వారు సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులకు నాణ్యమైన నారు అందించాలని కోరారు. సంబంధిత రసీదులను తప్పనిసరిగా రైతులకు ఇవ్వాల ని తెలియజేశారు. లైసెన్సు పొందిన నర్సరీ యాజమానులు మాత్రమే విక్రయాలు చేయాలని, పని సమయంలో నర్సరీకి సంబంధించిన రికార్డులు అందుబాటులో ఉండాలన్నారు. నర్సరీ యాజమాన్య రైతులు తదితరులు పాల్గొన్నారు.










