Nov 20,2023 23:27

పల్నాడు జిల్లా: పల్నాడు జిల్లా నరసరావుపేట నియో జకవర్గంలో సోమవారం సామాజిక సాధి కార యాత్ర జరిగింది. ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షత వహిం చగా, రాజ్యసభ సభ్యులు విజయ సాయిరెడ్డి నేతృత్వంలో కొనసాగింది. యాత్రలో మం త్రులు మేరుగ నాగార్జున, ఆది మూలపు సురేష్‌, కారుమూరి నాగేశ్వర రావు, ఎంపి శ్రీకష్ణదేవరాయలు, ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌, ఇతర నాయకులు పాల్గొ న్నారు. నరస రాపుపేట పట్టణంలో జరిగిన భారీ బహి రంగ సభలో మంత్రులు, ఇతర నాయ కులు పాల్గొ న్నారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మాట్లా డుతూ అర్హులందరికీ పథకాలు అందిం చాలని, పేదరిక నిర్మూ లన కోసం సిఎం జగన్‌ కృషి చేస్తున్నారని కొనియాడారు. చంద్రబాబు తన హయాంలో దోచుకో, దాచుకో, పంచుకో, తినుకో అనే నినా దంతో జైలుకు వెళ్లారని విమర్శించారు. తోడు దొంగలు అందరూ కలిసి మరోసారి దోచుకోవ డానికి సిద్ధం అయ్యారని ఆరోపించారు. మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ వైసిపి హయాంలో పేద లకు, దళితులకు ఎంతో మేలు జరిగిందని, బీసీలు తల ఎత్తుకుని తిరుగుతున్నారని, మైనార్టీలు సంతోషంగా ఉన్నారన్నారు. మంత్రి ఆదిమూలపు సురేష్‌ మాట్లా డుతూ వైసిపి మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వమని అన్నారు. రాజకీయ, ఆర్థిక, సామాజిక సాధికారత సీఎం జగన్‌తోనే సాధ్యమన్నారు. కులాల మధ్య చిచ్చుపెట్టే వ్యక్తి చంద్రబాబు అని, కోట్ల రూపాయలు పెట్టి బెయిల్‌ తెచ్చుకున్నా రని ఆరోపించారు. ఇంగ్లీష్‌ మీడియంలో పేదలు చదువుకోవడం పవన్‌ కల్యాణ్‌కు ఇష్టం లేదని, అతనిది పెత్తందారుల భావ జాలమని విమర్శించారు. 2014లో చంద్రబాబు 500 వందలకు పైగా హామీలు ఇచ్చి ఒక్కటీ అమలు చేయలేదని అన్నారు. నరసరావుపేట ఎంపి లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చి ఇవాళ ప్రజల ముందుకు రావడం గర్వంగా ఉందన్నారు. జిల్లాలో వరికపూడి ిశెల ఎత్తిపోతల పథకం, రూ.3 వేల కోట్లతో రహదారుల నిర్మాణం, గుర జాలకు వైద్య కళాశాల, 3 కేంద్రీయ విద్యా లయాలను తీసుకొచ్చామని తెలిపారు. ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి మాట్లా డుతూ చంద్రబాబు తన హయాం లో పదవులను ఉన్నత వర్గాల వారికి అమ్ముకున్నారని విమర్శించారు. సంక్షేమ పథకాల కింద డీబీటీ ద్వారా రూ 560 కోట్లను నియోజక వర్గ ప్రజలు పొందా రన్నారు. దీంతోపాటు నాన్‌ డిబిటి ద్వారా మరో రూ.280 కోట్ల లబ్ది పొందరన్నారు. త్వరలో నరసరావుపేటలో కోర్టులు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. రొంపి చర్లలో కేంద్రీయ విద్యాలయానికి, చిలక లూరిపేట, నరసరావుపేట బైపాస్‌ నిర్మా ణానికి అనుమతులు వచ్చాయని చెప్పారు. కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ ఖాన్‌ మాట్లాడుతూ జగనన్న విదేశీ విద్యాదీవెన పథకం తీసుకొచ్చి టాప్‌ 100 యూనివర్సిటీల్లో చదివే పిల్లలకు రూ. కోటి వరకు స్కాలర్‌ షిప్‌ ఇస్తున్నా రన్నారు.


ఎంపి విజయసాయిరెడ్డి ముఖాముఖి
ఏ1 కన్వెన్షన్‌ లో ప్రజా ప్రతినిధులు, ఉద్యోగులు, వివిధ వర్గాల ప్రజలతో ఎంపీ , వైసిసి దక్షిణ కోస్తా జిల్లాల రీజనల్‌ కోఆర్డి నేటర్‌ విజయసాయిరెడ్డి ముఖాముఖి నిర్వహించారు. విజయసాయిరెడ్డి మాట్లా డుతూ సీఎం జగన్‌ వైద్యరంగంలో విప్ల వాత్మక సంస్కరణ చేపట్టి, ప్రజలు మరింత మెరుగైన వైద్యం అందిస్తున్నారని అన్నారు. సామాజిక సాధికార యాత్రలో భాగంగా నరసరావుపేటలో వైద్యులతో నిర్వహించిన ప్రత్యేక సమా వేశంలో ఆయన మాట్లాడుతూ జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వంలో వైద్యులకు అధిక ప్రాధాన్యత కల్పించినట్లు తెలిపారు. వైసిపి లో మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు, నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇలా 15 మంది వైద్యులు ఎమ్మెల్యేలుగా ఉన్నారని గుర్తుచేశారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత విస్తరించి, ఆరోగ్యశ్రీ పరిధిలోని జబ్బులు, నెట్‌ వర్క్‌ ఆసు పత్రుల సంఖ్యను సీఎం జగన్‌ మరింతగా పెంచారన్నారు. పట్టణంలోని వివిధ రం గాలకు చెందిన ప్రముఖులతో సమావేశం నిర్వహించారు.అనంతరం నరసరావుపేట పల్నాడు బస్టాండ్‌ వద్ద నిర్వహించిన బహిరంగ సభ వరకు కొనసాగిన బస్సు యాత్ర లో పాల్గొని, ఇతర ప్రముఖులతో కలిసి బహిరంగ సభలో పాల్గొన్నారు. బస్సు యాత్రలో మంత్రులు మేరుగ నాగార్జున, ఆదిమూలపు సురేష్‌, కారుమూరి నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ జంగా కష్ణమూర్తి,మాజీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.