Sep 15,2023 00:39

సంక్షేమ పథకాల బ్రోచర్‌ను అందిస్తున్న కెకె.రాజు తదితరులు

ప్రజాశక్తి-సీతమ్మధార : జివిఎంసి 14వ వార్డు పరిధి నరసింహనగర్‌ ప్రాంతంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఉత్తర నియోజకవర్గ వైసిపి సమన్వయకర్త కెకె.రాజు, 14వ వార్డు కార్పొరేటర్‌ కె.అనిల్‌కుమార్‌రాజుతో కలిసి ఇంటింటికీ వెళ్ళి ఇప్పటివరకు ప్రభుత్వ చేపట్టిన సంక్షేమ పథకాల గురించి వివరించారు. ప్రజల సమస్యలనడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కెకె.రాజు మాట్లాడుతూ, పేద ప్రజలకు ఆర్థిక స్వాలంబన చేకూర్చడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్‌ కట్టుమూరి సతీష్‌, యాత కార్పొరేషన్‌ చైర్మన్‌ పిల్లి సుజాత, రాయుడు శ్రీను, కిరణ్‌రాజు, శ్రీనివాసరాజు, బల్ల శ్రీను, కె.సత్యనారాయణ, నాని, ఈశ్వరరావు, రమణమూర్తి, షేక్‌ బాబ్జీ, ఎం.సునీల్‌, కె.చిన్న, బి.గోవింద్‌, వసంతల అప్పారావు, ఎస్‌.వెంకటేష్‌, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.