సన్మానిస్తున్న మాధవి, సుభద్ర
ప్రజాశక్తి-పాడేరు టౌన్: అల్లూరి జిల్లా కేంద్రం పాడేరు జిల్లా ఆసుపత్రికి అసిస్టెంట్ సివిల్ సర్జన్‌గా ఎపి మెడికల్ కౌన్సిల్ మెంబర్ టి.నర్సింగరావును నియమించడం శుభపరిణామమని ఎంపి గొడ్డేటి మాధవి అన్నారు. ఇటీవల జిల్లా ఆసుపత్రికి సివిల్ అసిస్టెంట్ సర్జన్‌గా నియమితులైన నర్సింగరావును తలారిసింగిలోని నివాసంలో శుక్రవారం జడ్‌పి చైర్మన్ జల్లిపల్లి సుభద్ర, జిసిసి చైర్మన్ శోభ స్వాతిరాణి, ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మితో కలిసి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఎంపి మాట్లాడుతూ, గిరిజన ప్రాంత ప్రజలకు వైద్యపరమైన సేవలు అందించేందుకు ఆయనకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.










