ద్వితీయ స్థానం సాధించిన క్రీడాకారులు
ప్రజాశక్తి -నర్సీపట్నం రూరల్:జగనన్న క్రీడా సంబరాల్లో భాగంగా అనకాపల్లిలో జరిగిన కబడ్డీ పురుషుల పోటీల్లో నర్సీపట్న కబడ్డీ టీమ్ ద్వితీయ స్థానం సాధించింది. ఫైనల్ మ్యాచ్లో యలమంచిలితో నర్సీపట్నం టీమ్ తలపడి రెండవ స్థానం సాధించింది. ఈ సందర్భంగా ద్వితీయ స్థానం పొందిన క్రీడాకారులు మాట్లాడుతూ, కబడ్డీ పోటీలు చాలా ఆస క్తికరంగా కొత్త టెక్నికల్ స్కిల్స్‌తో సాగాయన్నారు. నాక్ ఔట్ గేమ్‌లో కష్టంగా పోరాడామని, ఈసారి మొదటి స్థానం సాధిస్తామని తెలిపారు. క్రీడాకారులను శాప్ కోచ్ అబ్బు, కబడ్డీ కోచ్ మజ్జి సాయి, వెంకటహరినాధ్, తదితరులు అభినందించారు.










