- ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం
ప్రజాశక్తి-నార్పల : ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం నార్పల మండల సమితి ఆధ్వర్యంలోవ్యవసాయ కూలీలను రైతులను విముక్తి చేసి వలస కూలీలను ఆపి నార్పల మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని అని కోరుతూ బుధవారం మండల ఈఓఆర్డి శైలజ రాణికి రైతు సంఘం నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి పెద్ద పెద్దయ్య మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా అనావృష్టి కారణంగా ఈ సంవత్సరం తీవ్ర కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. అనంతపురం జిల్లాతో పాటు రాయలసీమలో కరువు పరిస్థితులు నెలకొన్నాయని డౌన్ టు ఎర్త్ అనే సంస్థ విశ్లేషణ చేసింది అని కరువు నుండి పేదలను వ్యవసాయ కూలీలను రైతులను విముక్తి చేసి వలస కూలీలను ఆపడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏమాత్రం చర్యలు తీసుకోవడం లేదని ఇప్పటికైనా ఈ ప్రభుత్వం నార్పల మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి పెద్దపెద్దయ్య డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమాలలో సిపిఐ మండల కార్యదర్శి గంగాధర్, సుధాకర్ రైతు సంఘం మండల కార్యదర్శి జోసెఫ్, నారాయణప్ప, సీనా, పెద్దిరాజు తదితరులు పాల్గొన్నారు.










