నరేంద్ర కుమార్‌కు డాక్టరేట్ ప్రదానం
నరేంద్ర కుమార్‌కు డాక్టరేట్ ప్రదానం
ప్రజాశక్తి - క్యాంపస్
శ్రీ వేంకటేశ్వర విశ్వ విద్యాలయంలో ఇంజినీరింగ్ కళాశాల ఈఈఈ పరిశోధక విద్యార్థి వి నరేంద్ర కుమార్ కు డాక్టరేట్ డిగ్రీ ప్రదానం చేస్తున్నట్లు సిఇ మూడే దామ్లానాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈఈఈ విభాగం సీరియర్ ఆచార్యులు సిహెచ్ చెంగయ్య పర్యవేక్షణలో '' ఇన్వెస్టిగేషన్ ఆన్ రిడక్షన్ ఆఫ్ జనరేషన్ కాస్ట్ బై ఇంప్రూవింగ్ బాయిలర్ కెపాసిటీ థర్మల్ పవర్ స్టేషన్స్ యూజింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నిక్స్'' అనే అంశంపై పరిశోధనా గ్రంధాన్ని వర్సిటీకి సమర్పించినట్లు వెల్లడించారు. నరేంద్ర కుమార్ పలు జాతీయ, అంతర్జాతీయ పరిశోధనా జర్నల్స్ లలో అనేక పరిశోధన పత్రాలను ప్రచురించినట్లు వివరించారు.










