Sep 07,2022 22:56
సదస్సులో డిఎంహెచ్‌ఒ డాక్టర్‌ విజయలక్ష్మి

ప్రజాశక్తి-భీమునిపట్నం     నోటి సంరక్షణ, మంచి ఆహారపు అలవాట్లపై పాఠశాలల విద్యార్థులకు అవగాహన కల్పించారు. బుధవారం స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో ఆయుష్మాన్‌ భారత్‌లో భాగంగా నిర్వహిస్తున్న నేషనల్‌ ఓరల్‌ హెల్త్‌ ప్రోగ్రామ్‌ను జిల్లా వైద్యఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ విజయలక్ష్మి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, నోటి సంరక్షణతో అనేక వ్యాధులు దూరమౌతాయని, మంచి ఆహారపు అలవాట్లతో ఆరోగ్యం సిద్ధిస్తుందని విద్యార్థులకు తెలియజెప్పాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఎన్‌సిడి ప్రోగ్రామ్‌ అధికారి డాక్టర్‌ సమంత మాట్లాడుతూ, నోటి సంబంధిత వ్యాధులు రాకుండా ముందస్తు జాగ్రత్తలను వివరించారు. స్థానిక సిహెచ్‌సి ఎఎఫ్‌హెచ్‌సి కౌన్సిలర్‌ (యువ క్లినిక్‌) సత్యవతి మాట్లాడుతూ, కౌమారుల ప్రత్యేక ఆరోగ్య క్లినిక్‌ సేవలను వివరించారు. ఫిజియోథెరఫిస్ట్‌ డాక్టర్‌ శివ కోటేశ్వరరావు మాట్లాడుతూ, విటమిన్‌ ఎ, డి లోపం వలన కలిగే అనారోగ్య సమస్యలను వివరించారు. సిహెచ్‌సి సూపరింటెడెంట్‌ డాక్టర్‌ డి సిద్ధార్థకుమార్‌ అధ్యక్షతన జరిగిన సదస్సులో ఎంపిడిఒ, పి వెంకటరమణ, ఎంఇఒ కెఎ బాలామణి, కమ్యూనిటీ ఆర్గనైజర్‌ వై.మీనాక్షి పాల్గొన్నారు.