Jul 31,2022 23:17

చైతన్య నడక నిర్వహిస్తున్న గీతం దంత కళాశాల విద్యార్థులు

ప్రజాశక్తి-విశాఖపట్నం : నోటి ఆరోగ్యంపై ప్రజలను చైతన్య పరచడంలో భాగంగా గీతం దంత వైద్యకళాశాల ఆసుపత్రి ఆధ్వర్యాన ఆర్‌కె.బీచ్‌ లో ఆదివారం చైతన్య నడక, ఫ్లాష్‌ మాబ్‌ నిర్వహించారు. ఆగస్టు 1న జాతీయ నోటి ఆరోగ్య దినోత్సవం సందర్భంగా గీతం దంత కళాశాల నిర్వహించిన ఈ కార్యక్రమంలో కళాశాల వైస్‌ ప్రిన్సిపల్‌ డాక్టర్‌ వై.రవిశంకర్‌ మాట్లాడుతూ, నోటిని ఆరోగ్యంగా ఉంచుకోవడం ద్వారా శరీరాన్ని చాలా రోగాల బారిన పడకుండా కాపాడుకోవచ్చన్నారు. పొగాకు సంబంధ ఉత్పత్తుల నుంచి దూరంగా ఉండటం, దంత సంరక్షణ, తరచు బ్రష్‌లను మార్చడం, తీయటి పదార్ధాలను తగ్గించుకోవడం, తాజా పళ్ళను స్వీకరించడం, దంత వైద్యులను సంప్రదించడం చేయాలని సూచించారు. దంత విద్యార్థులు నోటి ఆరోగ్యంపై బ్యానర్లను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ కెవివి.ప్రభాకర్‌ ఇతర దంత వైద్యులు పాల్గొన్నారు.