Jun 29,2023 00:16
పుస్తకాలు పంపిణీ చేస్తున్న దృశ్యం

ప్రజాశక్తి-వేటపాలెం: ప్రాథమిక విద్యా అభివృద్ధిని ప్రోత్సహించేందుకు పట్టభద్రుల సంఘం ముందువరుసలో ఉంటుందని అధ్యక్షులు ప్రత్తి వెంకట సుబ్బారావు అన్నారు. బుధవారం చల్లారెడ్డిపాలెం పంచాయతీ స్థానిక దత్తక్షేత్రం ఎదురు మండల పరిషత్‌ పాఠశాలలో చదువుకొంటున్న 90 మంది విద్యార్థులకు నోట్‌ పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సుబ్బారావు మాట్లాడుతూ చిన్నప్పటి నుంచి క్రమశిక్షణ, ఏకాగ్రత అలవర్చుకోవాలని సూచించారు. విద్యాభివృద్ధికి సంఘం చేపడుతున్న సేవా కార్యక్రమాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో పట్టభద్రుల సంఘం ప్రధాన కార్యదర్శి సుంకర వెంకట లక్ష్మీ ప్రసాద్‌, దత్తక్షేత్రం కన్వీనర్‌ కె ప్రమీలదేవి, రావి మస్తాన్‌రెడ్డి, జి శేఖర్‌బాబు, చుండూరి నాగాంజనేయులు, గొడవర్తి రామకృష్ణ, వూటుకూరి కోటిస్వామి,షేక్‌ ఖాదర్‌, బుర్ర సాంబశివరావు పాల్గొన్నారు.