నంద్యాల పట్టణంలో అర్ధరాత్రి ఆకస్మికంగా నైట్ బీట్లను అడిషనల్ ఎస్పీ తనిఖీ
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్
నంద్యాల పట్టణంలో మంగళవారం అర్ధరాత్రి అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో నైట్ బీట్లు జరుగుతున్న విధానాన్ని పరిశీలించి .అధికారులకు కొన్ని సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది . ముఖ్యంగా గస్తీ నిర్వహిస్తున్న సమయంలో అనుమానాస్పద వ్యక్తులను చెక్ చేయాలని ఎలాంటి దొంగతనాలు జరగకుండా రాత్రి గస్తిని పటిష్టం చేయాలని ప్రతి సెక్టార్ కు సంబంధించిన అధికారులు నైట్ బీట్ లను చెక్ చేయాలని అంతేకాక కమాండ్ కంట్రోల్ నుండి గస్తీ నిర్వహించే వారిని కంట్రోల్ రూమ్ వారు అప్రమత్తం చేస్తూ ఉండాలన్నారు.ప్రతి గంటకు ఒకసారి వారి యొక్క లొకేషన్ వివరాలు నమోదు చేసుకోవాలని కంట్రోల్ రూమ్ అధికారులకు తెలియజేశారు. మరియు గస్తీ నిర్వహించే కానిస్టేబుల్ లకు అనుమానమాస్పద వ్యక్తులను చెక్ చేసి వీలైతే వారి యొక్క వేలిముద్రలు సేకరించాలని గస్తీలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని మీకు గస్తీ కేటాయించిన ప్రాంతాలలో ఉన్న నేరచరిత్ర గల వారిని చెక్ చేస్తూ ఉండాలని వారి యొక్క కదలికలను గమనిస్తూ ఉండాలన్నారు.నంద్యాల పట్టణంలోని శ్రీనివాస్ సెంటర్ ,బాలాజీ కాంప్లెక్స్ ,ఆత్మకూరు బస్టాండ్, అమ్మవారి శాల,ఎన్జీఓస్ కాలనీ సాయిబాబా నగర్, రైల్వే స్టేషన్ మూలసాగరం, ఎం ఎస్ నగర్, బొమ్మల సత్రం తదితర ప్రాంతాలలో పర్యటించి నైట్ బీట్లను చెక్ చేసి వారికి కొన్ని సలహాలు సూచనలు ఇవ్వడం జరిగిందన్నారు.అంతేకాక నంద్యాల పట్టణంలో నేర చరిత్ర కలవారి ఇంటి వద్దకు వెళ్లి వారిని చెక్ చేయడం జరిగింది, మరియు జిల్లాలోని నాలుగు సబ్ డివిజన్లో గస్తీ నిర్వహిస్తున్న అధికారులతో వి హెచ్ ఎఫ్ సెట్ ద్వారా మాట్లాడి అక్కడ సబ్ డివిజన్లో నైట్ బీట్లకు సంబంధించిన సమాచారం కనుక్కొని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకొని ప్రతి నైట్ బీటును సంబంధిత అధికారులు చెక్ చేయాలని ఆదేశించారు.










