తరగతులకు హాజరైన విద్యార్థులు..
నంద్యాల మెడికల్ కళాశాలలో
ఎంబిబిఎస్ తరగతులు ప్రారంభం
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్
నంద్యాల జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన మెడికల్ కళాశాలలో ఈ ఏడాది మొదటి సంవత్సరం ఎంబిబిఎస్ తరగతులు శుక్రవారం ప్రారంభమయ్యాయి. మెడికల్ కళాశాలకు 150 సీట్లు మంజూరు కాగా మొదటి, రెండవ కౌన్సిలింగ్‌లో దాదాపు 121 మంది విద్యార్థులు అడ్మిషన్ పొందారు. థర్డ్ కౌన్సిలింగ్ జరుగుతుంది. మిగతా 29 మంది విద్యార్థులు చేరే అవకాశం ఉంది. మొదటి సంవత్సరం ఎంబిబిఎస్‌లో అనాటమీ, ఫిజియాలజీ, బయో కెమిస్ట్రీ, కమ్యూనిటీ మెడిసిన్ బ్రాంచ్‌లను ప్రారంభించారు. పూర్తిస్థాయిలో ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు మెడికల్ కళాశాలలో ఉన్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ స్వర్ణలత తెలిపారు.










