నంద్యాల జిల్లా వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు కు అనుకూలమై ప్రాంతం
ఖనిజ, మినరల్ పరిశ్రమలకు బహు అనుకులం
జిల్లా పరిశ్రమల అధికారి సి. శ్రీనివాసులు యాదవ్
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్
నూతన పారిశ్రామిక ప్రోత్సాహక పాలసీ ద్వారా నిరుద్యోగ యువతకు మంచి అవకాశాలు ఉన్నాయని వాటిని యువత సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పరిశ్రమల అధికారి సి. శ్రీనివాసులు యాదవ్ తెలిపారు. ఆయన ప్రజాశక్తి నిర్వహించిన ముఖాముఖీ తో ముచ్చటించారు. జిల్లాల పరిశ్రమల స్థాపనకు అనువైన ప్రాంతంగాను ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రస్తుతం జిల్లాలో 9 భారీ, మెగా పరిశ్రమలు 4769 కోట్ల పెట్టుబడులతో 5727 మంది ఉపాధి కల్పిస్తూ పనిచేస్తున్నాయని అలాగే భారీ,మధ్యతరహా,మెగా పరిశ్రమలు వివిధ దశల లో నిర్మాణాల్లో ఉన్నాయన్నారు.
జిల్లాలో సూక్ష్మ,చిన్న, మధ్య తరహా పరిశ్రమలు పరిస్థితి ఏమిటి? ఎంత మందికి ఉపాధి కల్పించారు!
జి ఎం...మన జిల్లాలో 4,057 సూక్ష్మ,చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, సేవారంగం యూనిట్లు రూ.210.87 కోట్ల పెట్టుబడి తో 17, 045 మందికి ఉపాధి కల్పించడం జరిగింది.
ఎంత మందికి రుణాలు ఇప్పించారు?
జి ఎం..ప్రధాన మంత్రి ఉపాధి కల్పన పథకం ద్వారా 2022- 23 సంవత్సరంలో 91 మందికి బ్యాంకు రుణాలు మంజూరు చేయడం జరిగింది 51 మందికి రుణాలు కూడా విడుదల చేయడం జరిగింది. యూనిట్లు కూడా ప్రారంభించారు.అందులో 35 మందికి సబ్సిడీ విడుదల చేశారు.
జి ఎం..ప్రధానమంత్రి ఉపాధి ఉత్పత్తి పోగ్రామ్ కింద సేవా రంగం మ్యాన్ ఫ్యాచ్చరీ యూనిట్ల కొరకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఆన్ లైన్ లో దరఖాస్తూ చేసుకోవాలని ప్రభుత్వం సూచనలు ఇచ్చింది.
జిల్లా లో క్లస్టర్ పరిశ్రమలు ఎక్కడెక్కడ ఏర్పాటు చేయబోతున్నారు?
జి ఎం..2023-24 సంవత్సరం కొరకు జిల్లా లో బేతంచెర్ల, ఆళ్లగడ్డ లలో క్లస్టర్ పరిశ్రమలు రాబోతున్నాయి. బేతంచెర్ల లో స్టోన్ క్లస్టర్, ఆళ్లగడ్డ లో విగ్రహాలు ఎక్కువగా తయారు అవుతున్నందున అక్కడ విగ్రహం తయారీ క్లస్టర్ ను ఏర్పాటు చేయనున్నాము..అందుకు సంబంధించి పూర్తిస్థాయి సమాచారం ప్రపోజలను పంపాం..తొందరలోనే క్లస్టర్లు ఉపయోగించుకుంటాయి.
నంద్యాల ప్రాంతం ఎలాంటి పరిశ్రమలు ఏర్పాటు కు అనుకూలంగా ఉంటుంది?
జి ఎం..పరిశ్రమల ఏర్పాటుకు నంద్యాల జిల్లా అనుకూలంగా ఉంది.వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, ఖనిజ మినరల్ పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ఈ ప్రాంతం చాలా అనుకూలంగా ఉంటుంది.
నూతన పారిశ్రామిక అభివృద్ధి పాలసీ ఎప్పటి నుండి అమలు అవుతుంది?
జి ఎం..రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల మొదటి నుండి 2027 మార్చి 31 వ తారీకు వరకు నూతన పారిశ్రామిక అభివృద్ధి పాలసీ ని అమలు చేయనుంది.
ఈ పాలసీ ద్వారా ఔత్సహిక పారిశ్రామిక వేత్తలకు ఎలాంటి సదుపాయాలు కల్పిస్తున్నారు?
జి ఎం..ఈ పాలసీ ద్వారా పరిశ్రమలు స్థాపించే వారికి ప్రభుత్వం వివిధ రకాల రాయితీలు సదుపాయాలు ప్రోత్సాహాలు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మన జిల్లాలో పరిశ్రమలు స్థాపించే వారికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం హితోదికంగా సదుపాయాలు కల్పిస్తుంది..
గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్స్ సమ్మేట్ ద్వారా మన జిల్లాకు ఎన్ని పరిశ్రమలు వచ్చాయి?
జి ఎం..వైజాగ్ లో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్స్ సమ్మేట్ సమావేశంలో మన జిల్లాలో ఉన్న రాంకో,అల్ట్రాటెక్ సిమెంట్ పరిశ్రమల విస్తరణకు వాటి అభివృద్ధికి ప్రభుత్వం అనుమతులు ఇవ్వడం జరిగింది.ప్రస్తుతం ఉన్న రాంకో సిమెంట్ విస్తరణకు రూ.750 కోట్ల పెట్టుబడితో ఒప్పందం చేసుకుంది. అలాగే రూ.2,500 కోట్ల వ్యయంతో ఆల్ట్రాటెక్ సిమెంట్ పరిశ్రమను పెట్నీ కుంట గ్రామ సమీపంలో స్థాపించేందుకు ఒప్పందం చేసుకున్నారు.
జిల్లా లో పరిశ్రమల ఏర్పాటు కు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
జిఎం..ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు పిఎంఈజిపి స్కీమ్, పారిశ్రామిక ప్రోత్సాహక విధానం కింద పరిశ్రమలు, సేవా రంగాల యూనిట్లను స్థాపించాలని కోరుతున్నాం.. పరిశ్రమల ఏర్పాటుకు తీసుకోవాల్సిన విధానాన్ని ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకునే విధానాన్ని ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. పరిశ్రమలో ఏర్పాటు చేసుకునే వారికి ప్రభుత్వం అన్ని విధాల సహకరిస్తుంది. వారిని ప్రోత్సహిస్తుంది.. కాబట్టి నిరుద్యోగ యువత పర్సనల్ లో ఏర్పాటు దిశగా ముందుకు రావాలని ఆకాంక్షిస్తున్నాం..










