నందమూరి తారకరత్న మృతి చాలా బాధాకరం
ప్రజాశక్తి-డోన్
నందమూరి తారకరత్న మృతి చాలా బాధాకరమని డోన్ నియోజకవర్గ టిడిపి అభ్యర్థి ధర్మవరం సుబ్బారెడ్డి అన్నారు.సోమవారం డోన్ పట్టణంలో తెలుగుదేశంపార్టీ కార్యాలయం నందు నందమూరి తారకరత్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా డోన్ నియోజకవర్గ టిడిపి అభ్యర్థి ధర్మవరం సుబ్బారెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో నందమూరి తారకరత్న పనిచేసేందుకు ముందుకు వచ్చి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనీ కార్యకర్తలలో ఉత్సాహాన్ని నింపారని అన్నారు.కానీ నందమూరి తారకరత్న మృతితో తెలుగుదేశం పార్టీ లోనూ నందమూరి కుటుంబంలోనూ తీవ్ర విషాదాన్ని నింపిందని ఇది తెలుగుదేశం పార్టీకి తీరని లోటు అని అన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగుదేశంపార్టీ కార్యదర్శి వలసల రామకృష్ణ, డోన్ నియోజకవర్గ టిడిపి సలహాదారుల కమిటీ అధ్యక్షులు మురళీకృష్ణ గౌడ్,డోన్ పట్టణ టిడిపి అధ్యక్షులు చాటకొండ శ్రీనివాసులు,సీనియర్ టిడిపి నాయకులు ఆర్.ఈ.నాగరాజు,నంద్యాల జిల్లా టిడిపి కార్యదర్శి అబ్బిరెడ్డిపల్లె గోవిందు,జిల్లా టిడిపి రైతు కమిటీ ఉపాధ్యక్షులు బట్ట సత్యం,డోన్ నియోజకవర్గ టిడిపి యువ నాయకులు ధర్మవరం గౌతమ్ రెడ్డి,డోన్ మండలం టిడిపి ఉపాధ్యక్షులు మిద్దపల్లె గోవిందు,డోన్ మండలం టిడిపి ప్రధాన కార్యదర్శి ఎల్ఐసి శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.










