ప్రజాశక్తి-నందిగామ
నందిగామలో ట్రాఫిక్ సమస్యను నివారించేందుకే ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసినట్లు ఎన్టిఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ క్రాంతి రాణా టాటా పేర్కొన్నారు. నందిగామ పట్టణ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ను పోలీస్ కమిషనర్ క్రాంతి రానా టాటా, నందిగామ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు , ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ జగన్ మోహన్ రావు మాట్లాడుతూ నందిగామ పట్టణంలో, జాతీయ రహదారి పై ట్రాఫిక్ రద్దీ తీవ్రమవడంతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు పోలీస్ స్టేషన్ ఏర్పాటుపై పలుమార్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దష్టికి తీసుకువెళ్లటంతో సానుకూలంగా స్పందించిన ఆయన ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ను మంజూరు చేశారని తెలిపారు. రద్దీ ప్రదేశాలలో ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేసి ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీపీ మేరీ ప్రశాంతి , ఏసీపి జి. నాగేశ్వర్ రెడ్డి , సిఐలు సతీష్ , నాగేంద్రబాబు , ఎస్సైలు , నగర పంచాయతీ కమిషనర్ డాక్టర్ ఎస్. జయరాం పాల్గొన్నారు .










