ప్రజాశక్తి -గాజువాక : రాష్ట్ర ప్రజలకు వైద్యం అందుబాటులో ఉంచడమే ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి లక్ష్యమని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడుదల రజిని అన్నారు. నమ్మిదొడ్డిలో యుపిహెచ్‌సిని మంగళవారం ఆమె ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో ఆమె మాట్లాడుతూ, రూ.కోటి ఖర్చుతో నమ్మిదొడ్డి జంక్షన్‌లో పది పడకల ఆసుపత్రిని ఏర్పాటుచేశామని తెలిపారు. ఈ సమీప ప్రాంతాలైన పాలవలస, దేవాడ, ఇస్లాంపేట ప్రజలకు ఈ ఆసుపత్రి అందుబాటులో ఉంటుందన్నారు. భవిష్యత్తులో మరిన్ని వైద్య సదుపాయాలు అందించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. తమ ప్రభుత్వం విద్య, ఆరోగ్యం, ఉపాధి కోసం అధిక నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి ఎంపీ సత్యవతి, మేయర్ హరివెంకటకుమారి, ఎమ్మెల్యేలు అన్నంరెడ్డి అదీప్‌రాజ్, తిప్పల నాగిరెడ్డి, జిల్లా కలెక్టర్ మల్లికార్జున, కార్పొరేటర్ సూర్యకుమారి, మద్ది శ్రీను, ఎమ్‌పి.రెడ్డి, కార్యకర్తలు, పాల్గొన్నారు.










