Sep 22,2023 00:48

ప్రజశక్తి - చీరాల
వాడరేవసముద్ర తీరంలో వినాయక నిమజ్జానికి వచ్చి అలలు తాకిడి కొట్టుకొని పోతున్న నలుగురు యువతలను మెరైన్ వెంటనే స్పందించి రక్షించారు.మెరైన్ ఎస్ఐ సుబ్బారావు తెలిపిన వివరాల ప్రకారం.మెరైన్ సిఐ కె శ్రీనివాసరావు పర్యవేక్షణలో తమ సిబ్బంది సిబ్బంది మరియు లా అండ్ ఆర్డర్ స్టాఫ్ డ్యూటీ లో వుండగా చిలకలూరిపేట కు చెందిన కొంతమంది గణేష్ నిమజ్జనం నిమిత్తం సముద్రం లో స్నానం చేస్తుండగా ఒక్కసారిగా సముద్ర అలల ఎక్కువ కావటంతో తీరంలోకి జారిపోతున్నా నలుగురు మహిళలు చేతులు పైకి లేపి కేకలు వేశారు అన్నారు.అప్పటికె తీరంలోకి కొట్టుకుపోవటం విషయం గమనించిన మెరైన్ సిబ్బంది వెంటనే స్పందించి తీరం లోనికి వెళ్లి వారిని కాపాడి ఒడ్డుకు తీసుకువచ్చారు.ఈ సందర్బంగా హెచ్‌సి సైకం ప్రసాద్ మరియు  ఎస్ చిరంజీవి పిసి ఎ నరేష్  హోంగార్డు వి పోతురాజు వెంటనే స్పందించి వారిని రక్షించి వారికి ప్రదమ చికిత్స అందించి వారిని బంధువులకి అప్పగించటం జరిగింది. తీరంలో కొట్టుకుపోతున్న మహిళలను చాకచక్యంగా రక్షించి బంధువులకు అప్పగించిన మెరైన్ సిబ్బందిని అధికారులు, పర్యటకులు అభినందించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అలలు తాకిడి రోజు రోజుకి పెరుగుతున్న నేపథ్యంలో నిమజ్జనానికి వచ్చిన భక్తులు పోలీసులకు సహకరిస్తూ నిర్ణయించిన పరిధిలోనే సముద్ర స్థానాలు చేయాలని అన్నారు.