ప్రజాశక్తి - చింతలపూడి
నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ రూపొందించిన పథకాలపై అవగాహన కలిగి ఉండాలని జూనియర్ సివిల్ జడ్జి ఇబ్రహిం షరిఫ్ అన్నారు. నాగిరెడ్డిగూడెం రెసిడెన్షియల్ (బాలికల) స్కూల్‌లో మండల న్యాయ సేవల కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం అవగాహనా సదస్సు నిర్వహించారు. పాన్ ఇండియా న్యాయ సేవల్లో భాగంగా బాలికలకు (నల్సా) రూపొందించిన పథకాల గురించి, భారత రాజ్యాంగం, ప్రాథమిక హక్కులు, బాలల చట్టాలు, మహిళా చట్టాల గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా షరిఫ్ మాట్లాడుతూ స్వేచ్ఛ, సమానత్వలతో సమాజంలో జీవించాలంటే భారత రాజ్యాంగంపై అవగాహన కలిగి ఉండాలన్నారు. అందరూ చట్టాల గురించి తెలుసుకో వాలన్నారు. నల్సా పథకాల గురించి, చట్టాల గురించి వివ రించారు. చట్టం దృష్టిలో అందరూ సమాన మేనన్నారు. అన్యాయానికి గురైన వారు న్యాయం పొందేందుకు ఉచిత న్యాయ సలహాలు అందిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదుల పట్నాల శ్రీనివాసు, పింగుల డేవిడ్ రాజు, చైతన్య, మీసాల రమేష్, ఉలవలపూడి మౌనిక, సోషల్ వర్కర్ ఎమ్‌డి అక్బర్ అలీ, ఇన్‌ఛార్జి తహ శీల్దార్ షకిలున్నిసా, ప్రిన్సిపల్ సురేష్‌బాబు, పాల్గొన్నారు.










