
ప్రజాశక్తి - కర్లపాలెం
పాడి పరిశ్రమ అభివృద్ధి, పశువులకు సోకే వ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పూర్థిస్థాయిలో అవగాహన కల్పిస్తున్నామని పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరక్టర్ శంకరరావు అన్నారు. మండలంలోని నల్లమెతువారిపాలెంలో పశువిజ్ఞాన బడి కార్యక్రమం శనివారం నిర్వహించారు. పశువుల పోషణ గురించి, పశువుల తిరిగి పోర్లుట, పశుగ్రాసం ప్రాముఖ్యత, ప్రభుత్వ సబ్సిడీ ద్వారా లభించే సమీకృత దాణా గురించి, అదే విధంగా నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ ద్వారా గొర్రెల పధకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో పశువైద్య సిబ్బంది ఆట్ల బాల శంకర్‌రెడ్డి పాల్గొన్నారు.