ప్రజాశక్తి- అనకాపల్లి
మండలంలోని కొత్తూరు పంచాయతీ పరిధి రామాపురం కాలనీలో నల్లమారమ్మ అమ్మవారి నూతన ఆలయం నిర్మాణానికి ముత్యాల గ్రూప్ ఆఫ్ ఇండిస్టీస్ అధినేత ముత్యాల వెంకటేశ్వరరావు, ఆయన తనయుడు సంజరు సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ముత్యాల వెంకటేశ్వరరావు, సంజరుకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ముత్యాల వెంకటేశ్వరరావు, సంజరును దుస్సాలువ, గజమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ జ్యోతుల గణేష్ మాట్లాడుతూ కొన్ని సంవత్సరాలుగా ఆలయ నిర్మాణం చేపట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఇప్పటికి ప్రముఖ వ్యాపారవేత్త ముత్యాల వెంకటేశ్వరరావు సహకారంతో ఆలయ నిర్మాణం సాకారం అవుతున్నందుకు గ్రామం తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షులు పెంటకోట కృష్ణ, వైస్ చైర్మన్ చెక్క రాంబాబు, కార్యదర్శి అయిత రాము, కోశాధికారి ఎండి జిలానీ, కొవ్వాడ వాసు, పూడి సతీష్, ఎంవిఆర్ యువసేన ప్రతినిధులు పాల్గొన్నారు.










