అశాంతి సింహాసనంపై
శాంతి పతాకాన్ని ఎగరవేసిన
మహానేత అతడు...
ఆత్మసంకల్పమే ఆయుధంగా
మహాత్ముని ఆయుధాన్నే అస్త్రంగా
శ్వేత జాతీయుల గుండెల్లో గునపమై
నల్లజాతీయుల ఆకల్ని దీర్చ
ఎండిన పొలములో పచ్చని మెతుకై
ఉదయించిన నల్ల సూర్యుడాయన...
గెరిల్లా పొరాటాలతో గెలుపే లక్ష్యంగా
జాతి వివక్షపై రాజీలేని పోరాటం
సాగించిన భూమిపుత్రుడు..
ఆయువునంత దేశానికే ధారరరరరరవోస్తూ
ఐక్యతకే పరితపించిన ప్రజాస్వామ్య వాది...
నెర్రలు బారిన నేలలో
మొలకెత్తిన విత్తై...
ఎండిన చెరువు
మత్తడి దుంకినట్లుగా..
తల వంచిన అల
కెరటమై గర్జించినతీరుగా...
నల్లజాతీయుల కలలను నిజం జేసిన
నిండు పున్నమిచంద్రుడు
అతని మనస్సు తడి ఆరని వెన్నెలై
మాటల తూటలతో
అగ్రరాజ్యాన్ని సైతం అట్టుడికించి
తెల్లజాతీయుల తలలను వంచిన
నల్లకలువ ...
దినం దినం పగటి పొద్దై
వివక్షతలను తుంచేసిన
నల్లజాతి సూర్యుడతడు
- ఉప్పరి తిరుమలేష్
96189 61384