
చిన్న బజారు జంక్షన్ వద్ద నల్ల బెలూన్లతో టిడిపి నిరసన
ప్రజాశక్తి -భీమునిపట్నం : సామాజిక సాధికార బస్సు యాత్ర పేరుతో వైసిపి మరోసారి ప్రజలను మోసపుచ్చాలని ప్రయత్నిస్తోందని భీమిలి నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి కోరాడ రాజబాబు ఆరోపించారు. సామాజిక సాధికార బస్‌యాత్రను నిరసిస్తూ స్థానిక చిన్న బజారు జంక్షన్ వద్ద టిడిపి ఆధ్వర్యంలో నల్ల రంగు బెలూన్ల తో శనివారం నిరసన చేపట్టారు.ఈ సందర్భంగా రాజబాబు మాట్లాడుతూ, వైసిపి తలపెట్టిన యాత్ర ఓ బూటకమన్నారు. వైసిపి పాలనలో సామాజిక న్యాయం ఎక్కడ జరిగిందని, అన్నింటా ఒకే కులానికి ప్రాధాన్యత ఇచ్చారని ఆరోపించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు కోట్ని బాలాజీ, గంటా నూకరాజు, వానపల్లి సత్య, ఎం లక్ష్మణరావు, కె లీలావతి, పాసి నరసింగరావు పాల్గొన్నారు