May 10,2023 23:22

గాయపడిన క్షతగాత్రులు

ప్రజాశక్తి -నక్కపల్లి:నక్కపల్లి లో బుధవారం రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. మండలంలోని పెద్దతీనార్ల, చిన్న తీనార్ల గ్రామాలకు చెందిన పలువురు హైదరాబాద్‌ వెళ్లి ట్రైన్‌లో తునిలో దిగారు. అక్కడి నుండి ఆటోపై స్వగ్రామాలకు తిరిగి వస్తుండగా నక్కపల్లి జాతీయ రహదారిపై తహసీల్దార్‌ కార్యాలయం సమీపంలో రాంగ్‌ రూట్‌ లో వెళ్తున్న ఆటోను తుని వైపు వస్తున్న వ్యాను బలంగా ఢకొీట్టింది. దీంతోపాటు నక్కపల్లి నుండి సారిపల్లి వానిపాలెం వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని కూడా ఢకొీట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న వారితో పాటు, ద్విచక్ర వాహనంపై ఉన్న భార్య భర్తల తో పాటు, వారి కుమారుడు తీవ్రంగా గాయపడ్డారు.స్థానిక సి.హెచ్‌.సిలో వైద్యులు ప్రథమ చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం విశాఖ తరలించారు.బైక్‌ పై ప్రయాణిస్తున్న పెదపూడి కిరణ్‌, భారతి, పిల్లలు సుదీర్‌ లాజర్‌, శ్రుతి గాయపడ్డారు.