Jul 19,2023 17:02

గోడౌన్లో ఉన్న మందులను పరిశీలిస్తున్న ఏడి

నకిలీ విత్తనాలు, మందులు అమ్మితే చర్యలు -  ఏడి
ప్రజాశక్తి కొత్తపల్లి

     మండలంలోని పలు గ్రామాల్లో ఉన్న విత్తనాలు మందుల దుకాణదారులు నకిలీ విత్తనాలు మందులు అమ్మితే చర్యలు ఉంటాయని ఆత్మకూరు ఏడి ఆంజనేయ తెలిపారు. బుధవారం కొత్తపల్లి వ్యవసాయ అధికారి మహేష్ ఆధ్వర్యంలో మండలంలో ఉన్న ఎర్రమఠం ,శివపురం రైతు భరోసా కేంద్రాలను తనిఖీ చేయడం జరిగింది. అలాగే ఎర్రమఠం  గ్రామ రైతులతో ముఖాముఖి నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ గ్రామాల్లో ఉన్న దుకాణదారులు రైతులకు నకిలీ విత్తనాలు పురుగుల మందులు అమ్మినట్లు తెలిస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. రైతులందరూ జాగ్రత్తగా ఉండి నకిలీ వాటిపట్ల మోసపోకుండా జాగ్రత్తగా ఉండాలన్నారు. అలాగే ప్రస్తుతం జరుగుతున్నటువంటి వ్యవసాయ సంబంధ పథకాల గురించి రైతులకు వివరించడం జరిగింది. కౌలు రైతులు  కౌలు కార్డు తప్పనిసరిగా కోవాలన్నారు. కౌలు రైతులు కూడా వ్యవసాయ పథకాలు పొందవచ్చని తెలిపారు. ఖరీఫ్ సీజన్లో పంటలు వేసిన రైతులు తప్పనిసరిగా పంట నమోదు చేసుకోవాలని ఆయన తెలియజేశారు. రైతు భరోసా కేంద్రంలో ఉన్నటువంటి రిజిస్టర్ లను తనిఖీ చేసి తగు సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ రైతు భరోసా కేంద్రం ఎంపీఈఓ గౌరమ్మ్, శివపురం రైతు భరోసా కేంద్రం సహయకులు మౌనిక మరియు గ్రామ రైతులు పాల్గొనడం జరిగింది.