Jul 24,2023 00:30

మాట్లాడుతున్న ఏపూరి గోపాలరావు, పక్కన బాలకృష్ణ

పల్నాడు జిల్లా: జిల్లాలో నకిలీ విత్తనాలు కట్టడి చేయాల్సిన వ్యవ సాయ, విజిలెన్స్‌ శాఖాధికారులు నామమాత్రంగా పని చేస్తున్నారని ఎపి రైతు సంఘం పల్నాడు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు విమర్శించారు. స్థానిక కోటప్పకొండ రోడ్డు లోని పల్నాడు విజ్ఞాన కేంద్రంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గోపాలరావు మాట్లాడుతూ ఈపూరు, కారం పూడి మండలాలలో వెలుగు చూసిన నకిలీ విత్తనాల మూలాలపై క్షేత్ర స్థాయిలో విచారణ జరపాలని, నకిలీ విత్తన తయారీదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. లైసెన్స్‌ లేకుండా అనేక నర్సరీలలో గుర్తింపు లేని విత్తనాలతో మిరపనారు పెంచి అక్రమంగా రైతులకు అంటగడుతున్నారని, అదేవిధంగా వ్యవసాయ శాఖ ఆధీనంలో ఉన్న రైతు భరోసా కేంద్రాల ద్వారా అన్ని రకాల విత్తనాలు ఎరువులు, పురుగుమందులు పంపిణీ చేస్తామని చెబుతున్న ప్రభుత్వం ప్రచార ఆర్భాటానికే పరిమితమైందని విమర్శించారు. అనేక ప్రాంతాల్లో మిర్చి విత్తనాలు 10 గ్రాముల ప్యాకెట్‌ రూ.1000 నుండి రూ 2,000కు పెంచి నల్లబజారులో కొనుగోలు చేయాల్సి వస్తోందని అన్నారు. జిల్లాకు సరిపడా మిర్చి,వరి, కంది , పత్తి విత్తనాల పంపిణీలో వ్యవసాయ శాఖ నిర్లక్ష్యం వహిస్తోందని, దీంతో నకిలీ విత్తనాల విచ్చలవిడి విక్ర యాలు పెరిగాయని విమర్శించారు. పల్నాడు జిల్లాలో లక్ష హెక్టార్లకు పైగా మిర్చి సాగు చేస్తున్నారని అందుకు సరిపడా విత్తనాలను సరఫరా చేయడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు. వ్యవసాయం గిట్టుబాటు కాక అనేక ప్రాంతాల్లో సాగుకు రైతులు ముందుకు రాని పరి స్థితి ఉందన్నారు. విత్తనం నుండి పంట వరకు మొత్తం రైతు భరోసా కేంద్రం చూసుకుంటుందని చెప్పిన ప్రభుత్వం ఆచరణలో ముందుకు రాలేదన్నారు. వ్యవసాయానికి ప్రాథ మిక అవసరమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులను సకాలంలో సరఫరా చేయాలని డిమాండ్‌ చేశారు. దీనిపై నిర్లక్ష్యం వహిస్తే రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులను ఏకం చేసి పోరాటం చేస్తామని హెచ్చరించారు.