నియోజకవర్గం పూర్తి అభివృది ్ధ: పెద్దిరెడ్డి
ప్రజాశక్తి- పుంగనూరు: పుంగనూరు నియోజకవర్గాన్ని ఒకే కుటుంబం పేర్లు పరిపాలించింది అభివృద్ధి శూన్యమని, వైసీపీ అధికారంలోకి వచ్చిన నాలుగున్నర సంవత్సరంలో నియోజకవర్గంలో సంపూర్ణంగా అభివృద్ధి చేశామని రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. మండల పరిధిలో పలు ప్రారంభోత్సవాలు గురువారం మంత్రి చేపట్టారు. మండలంలో వాటర్ ప్లాంట్లు 14, వైఎస్సార్ హెల్త్‌సెంటర్లు 6, రైతు భరోసా కేంద్రాలు 4, గ్రామ సచివాలయం ప్రారంభోత్సవం చేశారు. వాటర్‌షెడ్ ద్వారా లబ్ధిదారులకు వ్యవసాయ పరికరాల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సిఎం వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చాక సచివాలయంతో పాటు, అర్బికేలు, హెల్త్ క్లినిక్‌లు ఏర్పాటు చేశారన్నారు. మన ప్రాంతంలో గతంలో రైతులు ఇబ్బంది పడేవారని, విత్తనాల కోసం లైన్‌లో నిలబడి సొమ్మసిల్లి పడిపోయిన ఘటనలు అనేకం ఉన్నాయని అయితే నేడు ఆ పరిస్థితి లేకుండా మొత్తం ఆర్బికేల్లోనే అందుబాటులో ఉంచారని తెలిపారు. మన రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటును పరిశీలించడానికి దేశ, విదేశాల నుండి ప్రతినిధులు వస్తున్నారని తెలిపారు. నేడు మొత్తం 520మంది రైతులకు రూ.1.2కోట్లు విలువ గల వ్యవసాయ పనిముట్లు అందిస్తున్నామని అన్నారు. మన కోసం నిరంతరం కషి చేస్తున్న సిఎం వైఎస్ జగన్‌కు అందరం అండగా నిలవాలన్నారు. ప్రతి కుటుంబంకు పథకాలందే విధంగా పాలన సాగుతుందని చెప్పారు. మన ప్రభుత్వం వచ్చాక ఓటు వేశారా లేదా కూడా చూడకుండా అభివద్ధి చేస్తున్నామన్నారు. ప్రతి ఇంటికి కుళాయి ద్వారా నీరు ఇవ్వాలని కషి చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే ప్రతి గ్రామంలో ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ నిర్మించామని తెలిపారు. సిఎం వైఎస్ జగన్ 1500 కోట్ల రూపాయలతో మూడు రిజర్వాయర్లు మంజూరు చేస్తే... టిడిపి నాయకులు కోర్టులో కేసు వేసి అడ్డుకున్నారని చెప్పారు. కేసులు తొలిగిన వెంటనే పనులు చేపడుతామని ఎన్నికలలోగా పూర్తిచేసి నీరు నిలుపుతామన్నారు. యువకులు, పెద్దలు అందరూ సిఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి అండగా నిలవాలని కోరారు. ఈసమావేశానికి ఎంపీపీ అక్కిసాని భాస్కర్ రెడ్డి అధ్యక్షత వహించారు. చిత్తూరు పార్లమెంట్ సభ్యుడు ఎన్.రెడ్డప్ప, జడ్పీ చైర్మన్ వాసు, పీకేఎం ఉడా చైర్మన్ ఎన్.వెంకట్‌రెడ్డి యాదవ్, టిటిడి బోర్డు మెంబర్ పోకల అశోక్ కుమార్, స్టేట్ ఫోక్ అండ్ కల్చరల్ చైర్మన్ కొండవీటి నాగభూషణం, జడ్పిటిసి జ్ఞాన ప్రసూన చంద్రారెడ్డి యాదవ్, నియోజకవర్గ పరిశీలకుడు జింక వెంకట చలపతి, మాజీ ఎంపీపీ నరసింహులు, మాజీ ఏఎంసీ చైర్మన్ నాగరాజురెడ్డి, ఆర్టీసీ యూనియన్ గౌరవ అధ్యక్షుడు జయరామిరెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు, వైసిపి నాయకులు పాల్గొన్నారు.










