ప్రజాశక్తి - పరవాడ
పరవాడ మండలం తానాం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నియోజకవర్గ స్థాయి ఎస్‌జిఎఫ్ బాలికల క్రీడా పోటీలను ఎంపీపీ పైలా వెంకట పద్మలక్ష్మీ శ్రీనివాసరావు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించి ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు. సంపూర్ణ ఆరోగ్యానికి క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో తానాం సర్పంచ్ కన్నూరు దేవి, ఎంపీటీసీ అభ్యర్థి డెక్క నూకరాజు, పరవాడ ఉప సర్పంచ్ బండారు రామారావు, వైసిపి నాయకులు బొద్దపు చిన్నారవు, చల్ల కనకారావు, గోరుపుటి శ్రీను, గోరుపుటి రమణ, చీపురుపల్లి శ్రీను, గోరుపుటి నాయుడు, రెడ్డి నాయుడు పాల్గొన్నారు.
ముగిసిన క్రీడా పోటీలు
వడ్డాది : వడ్డాది కోవెల అప్పన్నదొర జెడ్‌పి ఉన్నత హైస్కూల్లో నియోజకవర్గ స్థాయి బాల బాలికల క్రీడా ఎంపిక పోటీలు శుక్రవారం ముగిశాయి. షటిల్, వాలీబాల్, త్రోబల్, కబడ్డీ, యోగ, ఖోఖో, బాల్ బ్యాట్మింటన్, అథ్లెటిక్స్ క్రీడల్లో ఎంపికలు నిర్వహించారు. ఈ క్రీడలలో ఎంపికైన వారు జిల్లా స్థాయి పోటీలలో పాల్గొంటారని నియోజకవర్గస్థాయి సమన్వయకర్త ఎస్.అప్పలనాయుడు తెలిపారు. ఈ పోటీలను జెడ్‌పిటిసి దొండా రాంబాబు తిలకించారు. క్రీడాభివృద్ధికి జెడ్‌పి సీఈఓతో మాట్లాడి ప్రత్యేక నిధులు మంజూరుకు కృషి చేస్తానని రాంబాబు చెప్పారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఎం పివి.శేషుబాబు, పీడీ కడగళ్ల నారాయణమ్మ, పిఇటి అప్పలనాయుడు, అన్ని పాఠశాలల వ్యాయామం ఉపాధ్యాయులు పాల్గొన్నారు.










