నియోజకవర్గ సమస్యలపై
అధికారులు సమన్వయంతో పనిచేయాలి: కలెక్టర్
ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్:
జిల్లాలోని వివిధ నియోజకవర్గవర్గాలకు సంబంధించి చేపట్టాల్సిన పనులు గురించి నియోజకవర్గాల అభివద్ధి సమావేశంలో నిర్ణయించిన మేరకు పై అధికారులకు ప్రతిపాదనలు పంపాల్సి ఉంటే వెంటనే వాటిని తయారు చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.షన్మోహన్ అన్నారు. మంగళవారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ వివిధశాఖల అధికారులతో నియోజకవర్గాల సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి చేపట్టాల్సిన పనులు గురించి చర్చించేందుకు సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాప్రతినిధులతో నియోజకవర్గ సమావేశాలు నిర్వహించడం జరిగిందని పనులకు సంబంధించి ప్రతిపాదనలు తీసుకురావడం జరిగిందని ఈ ప్రతిపాదనలకు ఉన్నతాధికారుల నుంచి అనుమతి అవసరం ఉంటుందని ఇందుకు సంబంధించి ప్రతిపాదనలను వెంటనే తయారు చేయాలన్నారు. ప్రధానంగా రోడ్లు భవనాలు శాఖలకు సంబంధించి మార్పులు, చేర్పులు అడగడం జరిగిందని అదేవిధంగా మార్కెట్ కమిటీలకు సంబంధించి ఇరిగేషన్ శాఖకు, రోడ్లు భవనాల శాఖకు, సమ్మర్ స్టోరేజ్ బ్యాంకులకు సంబంధించి భూ సేకరణ, మున్సిపాలిటీలలో చేపట్టాల్సిన పనులు లాంటి కార్యక్రమాలను ప్రతిపాదించడం జరిగిందని ఈ ప్రతిపాదిత పనుల ఆమోదం కోసం ప్రభుత్వ అనుమతులకు లేఖలు తయారు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పి.శ్రీనివాసులు, డిఆర్వో రాజశేఖర్, డిప్యూటీ ట్రైనీకలెక్టర్లు లక్ష్మీప్రసన్న, కిరణ్మయి, హౌసింగ్ పీడీ పద్మనాభం, ఎస్ ఈ పంచాయతీరాజ్ చంద్రశేఖర రెడ్డి, ఆర్ అండ్ బి ఎస్‌ఈ మదన్ మోహన్‌రెడ్డి, ఇరిగేషన్ ఎస్‌ఈ విజరు కుమార్, సోషల్ వెల్ఫేర్ డిడి రాజ్యలక్ష్మి, జిల్లా విద్యాశాఖ అధికారి విజయేంద్ర రావు, ఆర్డీవోలు రేణుక శివయ్య తదితరులు పాల్గొన్నారు.










