Nov 21,2022 00:13

పర్యవేక్షకుడు కృష్ణతో టిడిపినాయకులు

ప్రజాశక్తి-చీడికాడ:ఇప్పటికే మాడుగుల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీలో రానున్న ఎన్నికల్లో అభ్యర్థి ఎవరనేది తెలియక సతమవుతున్న నేపథ్యంలో దీనికి తెరదించేందుకు తెలుగుదేశం పార్టీ మండల స్థాయి విస్తత సమావేశం మండలంలో జి.కొత్తపల్లిలో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మాడుగుల నియోజకవర్గం పర్యవేక్షకుడు లోడగల కృష్ణ హాజరయ్యారు. ఈ సమావేశానికి హాజరైన టిడిపి కార్యకర్తలు మండలంలో పార్టీలో ఉన్న ప్రస్తుత విభేదాలు, పరిస్థితులను కృష్ణకు వివరించారు. ఇప్పటివరకు నియోజకవర్గ నాయకుడు ఎవరో తెలియక సతమతమవుతున్నామని, మాడుగుల నియోజవర్గ శాసనసభ సభ్యులు ఎవరని, తెలియక పార్టీ అయోమయకములో ఉందని తక్షణమే ఈ సమస్యను పరిష్కరించాలని లోడగల కృష్ణకు కార్యకర్తలు నాయకులు కోరారు. దీనికి సంబంధించి అధినాయకుడు చంద్రబాబుకి వివరిస్తానని అప్పటివరకు కార్యకర్తలు, మండల నాయకులు నియోజకవర్గ నాయకులు కలిసికట్టుగా పనిచేయాలని కృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమానికి మాడుగుల ఇన్చార్జి పివిజి కుమార్‌, మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు, మండల పార్టీ కన్వీనర్‌ చిన్నమనాయుడు, నాయుడు, వనాయకులు, ఎంపీటీసీలు, సర్పంచులు కార్యకర్తలు పాల్గొన్నారు