పుల్లంపేట : మండల పరిధిలోని స్థానిక ప్రజా పరిషత్ సభ భవనంలో సోమవారం ఎంపిపి ముద్దా బాబుల్‌రెడ్డి అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందాలంటే అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. అధికారు లందరూ సమన్వయంతో పనిచేసినప్పుడే మండల అభివద్ధి జరుగుతుందని తెలిపారు. రైతుల కోసం అందిస్తున్న పథకాలపై అవగాహన కల్పించాలని మండల వ్యవసాయ అధికారులకు సూచించారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలకు పిల్లలకి సరైన భోజనం అందించాలని అంగ న్వాడీ సిబ్బందికి తెలిపారు. జగనన్న కాలనీలో నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని హౌసింగ్ అధికారులకు తెలిపారు. మండలంలో విద్యుత్ సమ స్యలు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విద్యుత్ అధికారులకు సూచించారు. రైతులకు ట్రాన్స్‌పార్మర్లు అందించడంలో పుల్లంపేట విద్యుత్ అధికారులు వరుసలో ఉన్నారని తెలిపారు. మండలంలో ఎటువంటి సమస్యలు ఎదురైనా తమ దష్టికి తీసుకుని వస్తే జిల్లా అధికారులతో మాట్లాడి సంబంధిత సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. మండలంలో రెవెన్యూ సమస్యలను సకాలంలో స్పందించి సమస్యలు పరిష్కరించాలని తహశీల్దార్ నరసింహాకుమార్‌కు సూచించారు. కార్యక్రమంలో మాల వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ మడగలం శ్రీనివాసులు, మండల కన్వీనర్ సయ్యద్ ముస్తాక్, మండల వైస్ ఎంపిపి జయశంకర్ నాయుడు, ఎంపిడిఒ రఘురాం, ఇఒపిఆర్‌డి ప్రకాశం, తహశీల్దార్ నరసింహకుమార్, విద్యాధికారులు రఘునాథంరాజు, నాగ తిరుమల రావు, వ్యవసాయ శాఖ అధికారి కష్ణ చైతన్య, పశుసంవర్ధక శాఖ అధికారి సుధీష్, మండల వైద్యాధికారి డాక్టర్ మనోజ్ డాక్టర్ సానే శేఖర్, ఎపిఒ, ఎపిఎం సుబ్బలక్షమ్మ, సచివాలయ సిబ్బంది ,పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వోలు అగ్రికల్చర్ సిబ్బంది పశుసంవర్ధక శాఖ సిబ్బంది ఉపాధి హామీ సిబ్బంది, వైద్య సిబ్బంది, ఎస్సై రఘురాం, పోలీస్ సిబ్బంది అటవీ శాఖ సిబ్బంది, హౌసింగ్ ఇరిగేషన్ ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, విద్యుత్‌శాఖ అధికారులు, అన్ని పంచాయతీల సర్పంచులు, ఎంపిటిసిలు పాల్గొన్నారు. సమావేశంలో మాట్లాడుతున్న ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు










