మాట్లాడుతున్న రాజ్యసభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి
నియోజకవర్గ అభివద్దికి ఎంఎల్‌ఎ కృషి
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్:ఆత్మకూరు శాసనసభ్యుడిగా ఒకటిన్నర సంవత్సర కాలంలోనే మేకపాటి విక్రమ్ రెడ్డి అన్ని విషయాలపై పూర్తి అవగాహన తెచ్చుకుని ప్రతి సమస్యను పరిష్కరిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారని, ఆయన నియోజకవర్గ అభివద్దికి చేస్తున్న కషి ప్రశంసనీయమని రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. శనివారం ఆత్మకూరు మున్సిపల్ కార్యాలయంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం అన్ని సచివాలయాల్లో ముగిసిన సందర్భంగా ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ఏర్పాటు చేసిన ముగింపు సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ప్రజాప్రతినిధులు, నాయకులు ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా మున్సిపల్ పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం ముగిసిన సందర్భంగా ఆత్మకూరు శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి మున్సిపల్ పరిధిలో చేపట్టిన పనుల వివరాలు, సమస్యలపై తీసుకున్న చర్యలు, అభివద్ధి పనుల విషయమై వివరించారు. అనంతరం రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని రాష్ట్రంలోని అందరూ శాసనసభ్యులు అమలు చేయాలని సంకల్పించిన సందర్భంలో చాలా మంది శాసనసభ్యులు ఇలాంటి కార్యక్రమాలు గతంలో చేయలేదన్నారు.ఇప్పుడు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా పర్యటిస్తున్న ఎమ్మెల్యేలు నూటికి నూరు శాతం ముఖ్యమంత్రి నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. ఎంపిగా నన్ను ఆశీర్వదించండి :
ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే మేకపాటివిక్రమ్ రెడ్డికి తోడుగా నిలిచి ఓటేస్తే తనకు వేసినట్లేనని, నెల్లూరు పార్లమెంట్ స్థానానికి వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేస్తున్నట్లు ప్రతి ఒక్కరూ ఆశీర్వదించాలని రాజ్యసభ సభ్యులువేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి కోరిన విధంగా ఆత్మకూరు మున్సిపల్ పరిధిలో తాగునీటి పథకం అభివద్ది కోసం రూ.42 లక్షల నిధులు అందచేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు గురు మోహన్, రూప్ కుమార్ యాదవ్, జె సిఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ సిహెచ్ ఆదిశేషయ్య, మున్సిపల్ చైర్ పర్సన్ గోపారం వెంకట రమణమ్మ, వైస్ చైర్మన్‌లు డాక్టర్ శ్రావణ్ కుమార్ , షేక్ సర్దార్, మున్సిపల్ కమిషనర్ బి.నాగేశ్వరరావు, ఎంపీపీ కేత వేణుగోపాల్ రెడ్డి, కౌన్సిలర్లు, వైసిపి నాయకులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు










