Aug 01,2023 21:57

డిఐజికి పుష్పగుచ్చం అందజేస్తున్న దీపిక

ప్రజాశక్తి-హిందూపురం : హిందూపురం నియోజక వర్గంలెఓ శాంతి భద్రతలపై తగిన చర్యలు తీసుకోవాలని నియోజక వర్గ సమన్వయ కర్త, ఇన్‌ఛార్జి దీపిక అనంతపురం రేంజ్‌ డిఐజి అమ్మి రెడ్డిని కోరారు. ఈ మేరకు ఆమె మంగళవారం అనంతపురంలో డిఐజి కార్యాలయంలో ఆయనను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా పలు అంశాలపై చర్చించారు. నియోజకవర్గంలో జరుగుతున్న దొంగతనాలు, భూ కబ్జాలు, మట్కా, గ్యాంబ్లింగ్‌, అసాంఘిక కార్యకలాపాలను నిర్మూలించాడానికి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. పలు స్టేషన్‌లో సిబ్బంది కొరత ఉందని దీనిని తీర్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. స్పందించిన డీఐజీ తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సిబ్బంది నియమకం విషయంలోను చర్యలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు గుడ్డంపల్లి వేణు రెడ్డి తదితరులు పాల్గొన్నారు.