Sep 16,2023 22:19

ప్రజాశక్తి-కలక్టరేట్‌ (కృష్ణా) : విధి నిర్వహణలో అంకిత భావంతో పనిచేసే మరిన్ని పదోన్నతుల పొందాలని జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ ఉప్పాల హారిక ఆకాంక్షించారు. కృష్ణా జిల్లా పరిషత్‌ లోని వివిధ విభాగాల్లో పనిచేస్తూ మృతి చెందిన ఉద్యోగుల కుటుంబాల పిల్లల 16 మందికి శనివారం ఆమె చాంబర్లో నియా మక ఉత్తర్వులు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వివిధ పనులపై కార్యాలయాలకు వచ్చే ఉద్యోగులకు, ప్రజలకు మెరుగైన సేవలు అందించినప్పుడే మీ విధి నిర్వహణకు న్యాయం చేసినట్లు అవుతుందని ఆ విధంగా ప్రతి ఒక్కరు కషి చేయాలని సూచించారు. ఇంజనీరింగ్‌ కార్యాలయాలలో జూనియర్‌ అసిస్టెంట్‌ -5, టైపిస్ట్‌-7, ఆఫీస్‌ సబార్డినేట్‌-2 ఉత్తర్వులను మరియు లాబ్‌, లైబ్రరీ అసిస్టెంట్‌ లకు జూనియర్‌ అసిస్టెంట్‌(2) లు గా పదోన్నతి కల్పించి మొత్తము 16 మందికి నియామక ఉత్తర్వులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ ముఖ్య కార్య నిర్వహణాధికారి వీర్ల జ్యోతి బసు,ఉప ముఖ్య కార్యనిర్వణాధికారి జి. శ్రీనివాసరావు లు పాల్గొన్నారు.