Aug 20,2023 23:45

ప్రజాశక్తి - ఇంకొల్లు రూరల్‌: రోటరీ క్లబ్‌ ఆధ్వర్యంలో రోటరీ సభ్యులు సోమేపల్లి రామమోహనరావు సతీమణి లక్ష్మీకాంతం 3వ వర్ధంతి సందర్భంగా గంగవరం వద్ధాశ్రమంలోని వద్ధులకు అవసరమైన రూ.4వేల విలువైన నిత్యావసర సరుకు లు, ఫలాలు అందజేశారు. తోటివారికి సహాయం చేయాలనే సంకల్పంతో ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమములో రోటరీ ఉపాధ్యక్షులు అలవల శ్రీనివాసరెడ్డి, గోరంట్ల నాగేశ్వర రావు, వంకాయలపాటి శ్రీమన్నారాయణ, లక్ష్మి కాంతం కుమార్తె ఝాన్సీలక్ష్మీ, అల్లుడు పోపూరి శేషగిరిరావు, ఆశ్రమము నిర్వాహకులు బొడ్డు వరప్రసాద్‌ పాల్గొన్నారు. రోటరీ సభ్యులు రామమోహనరావు సేవలను అభినందించారు.