ప్రజాశక్తి-కాకినాడ నిత్యావసర సరుకులు, కూరగాయల ధరలు అదుపులో ఉంచాలని డిమాండ్ చేస్తూ గురువారం కాకినాడ ఆర్‌డిఒ కార్యాలయం వద్ద సిపిఎం ఆందోళన చేపట్టింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కన్వీనర్ ఎం.రాజశేఖర్, జిల్లా సీనియర్ నేత దువ్వా శేషబాబ్జి, నాయకులు కె.సత్తిరాజు, సిహెచ్.రాజ్‌కుమార్ మాట్లాడారు. గడిచిన కొన్ని వారాలుగా టమోట, అల్లం, మిర్చి వంటి కూరగాయల ధరలు చాలా దారుణంగా పెరిగాయన్నారు. ఇప్పటికే పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయన్నారు. అన్ని రకాల బియ్యం పైనా బస్తాకు ఒక్కసారిగా రూ.200 పెంచారని తెలిపారు. మరోపక్క విద్యుత్ ఛార్జీలు రూ.వేలల్లో బిల్లులు వస్తున్నాయన్నారు. రకరకాల ఛార్జీల పేరుతో విద్యుత్ బిల్లులు వస్తున్నాయన్నారు. ధరలు ఇంతగా పెరిగినా రైతులకు ఏమాత్రం మేలు జరగడం లేదన్నారు. అనంతరం ఆర్‌డిఒ ఎన్‌వివి.సత్యనారాయణకు వినతి పత్రం సమర్పించారు. వర్షంలోనే నినాదాలు చేస్తూ జెడ్‌పి సెంటర్ వరకు ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు పలివెల వీరబాబు, మేడిశెట్టి వెంకట రమణ, మలక వెంకట రమణ, చంద్రమళ్ల పద్మ, నర్ల ఈశ్వరి, సిహెచ్.వేణు, కె.నాగజ్యోతి, నాగాబత్తుల సూర్యనారాయణ, సిహెచ్.విజరు కుమార్, మూర్తి, రాణి, కె.రాజశేఖర్, రాజు, కుమారస్వామి, చిట్టిబాబు, గంగా సూరిబాబు, దినేష్, సాహిత్, వాసు తదితరులు పాల్గొన్నారు.










