Jul 06,2023 00:57

నిత్యావసరాలు అందజేస్తున్న ఎల్‌ఐసి యూనియన్‌ నాయకులు

ప్రజాశక్తి- అద్దంకి : ఆల్‌ ఇండియా ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ వారోత్సవాలలో భాగంగా అంద్దంకి బ్రాంచి యూనియన్‌ ఆర్థిక సహకారంతో శింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం వద్ద శ్రీ రామా వద్ధుల ఆశ్రమంలోని వద్దులకు అవసరమైన నెలకు సరిపడా నిత్యావసర సరుకులను బుధవారం అందజేశారు. ఆశ్రమ నిర్వాహకుడు రావూరి రంగయ్యకు వీటిని అందజేశారు. అనంతరం శింగరకొండ రోడ్డులోని చైతన్య బధిరుల ఆశ్రమ పాఠశాలకు రూ. 15 వేల విలువైన వంట సామగ్రి అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల నిర్వహకులు పూనూరి ఆరోగ్యం ఐసిఇయు జిల్లా అధ్యక్షుడు పారా శ్రీనివాసరావు, అద్దంకి యూనిట్‌ అధ్యక్షుడు వినీత్‌, కార్యదర్శి ఆంజనేయులు, కోశాధికారి తవ్వా రవి,ప్రసాదరావు, సత్యనారాయణ, నాగేశ్వర రావు పాల్గొన్నారు.