May 24,2023 00:37

నిత్యావసరాలు అందజేస్తున్న నిజాం

ప్రజాశక్తి-పిట్టలవాని పాలెం : టిడిపి బాపట్ల నియోజకవర్గ బాధ్యులు వేగేసిన నరేంద్ర జన్మదిన వేడుకలను పురస్కరించుకుని ఛందోలు గ్రామ టిడిపి యువనాయకుడు నిజాం ఆధ్వర్యంలో మంగళవారం వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు 100 పేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిజాం మాట్లాడుతూ పేదలకు నిత్యావసరాలు అందజేయడం ఎంతో సంతోషం గా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మీరా, ఖాసీం, సైదా, బాజీ, టిటిపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు