ప్రజాశక్తి -ములగాడ : జివిఎంసి 60వ వార్డు పరిధిలో గల సుమారు 250 మంది నిరుపేదలకు కోరమాండల్ పరిశ్రమ సమకూర్చిన నిత్యావసరాలను శనివారం మహాత్మాగాంధీ వాణిజ్య సముదాయం సమీపంలో పశ్చిమ నియోజకవర్గం వైసిపి సమన్వయకర్త ఆడారి ఆనంద్ కుమార్ పంపిణీచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోరమాండల్ పరిశ్రమ సేవాకార్యక్రమాలు స్ఫూర్తిదాయకమన్నారు. భవిష్యత్తులో మరిన్ని సేవాకార్యక్రమాలు చేపట్టి పేదవారి ఇంట్లో వెలుగులు నింపాలని కోరారు. వార్డు కార్పొరేటర్ డాక్టర్ పీవీ సురేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు గుండపు నాగేశ్వరరావు, బల్ల లక్ష్మణరావు, కొణతాల సుధ, పుర్రే పూర్ణశ్రీ, వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కలిదిండి బద్రీనాథ్, కోరమాండల్ అధికారులు వేణు, వెంకటరమణ పాల్గొన్నారు.










