నిత్యావసర సరుకులు పంపిణీ
ప్రజాశక్తి-కావలి : విశ్వోదయ రెక్టార్ దొడ్ల వినయకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం డి.ఆర్. విశ్వోదయ సేవా సమితి ఆధ్వర్యంలో కావలి వెంగళరావు నగర్‌లోని తమ కార్యాలయంలో రూ.50వేలు విలువ చేసే బియ్యం, వంటింటి సరుకులు రూ.60 నగదు 60 మంది నిరుపేద వృద్ధులకు పంపిణీ చేశారు. సేవాసమితి డైరెక్టర్ కూనం తాతిరెడ్డి మాట్లాడుతూ డి.ఆర్. విద్యాదాత, దార్శనికుడు అని, వేలాదిమందిి విద్యార్థుల జీవితాలలో వెలుగు నింపిన మహోన్నత వ్యక్తి అన్నారు. డి.ఆర్.పేరుపై పేద వృద్ధులను ఆదుకుంటున్న వారి కుమారులు వినరు కుమార్ రెడ్డి, విద్యాధర్ కుమార్ రెడ్డిలకు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో సేవాసమితి డైరెక్టర్ కూనం తాతిరెడ్డి, రామ్‌సెంటర్ చైర్మన్ దొడ్ల మనోహరరెడ్డి, సభ్యులు నల్లూరు రామకృష్ణ, సతీష్‌సింగ్, రంగనాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.










