సరుకులు పంపిణీ చేస్తున్న కృష్ణకుమారి
ప్రజాశక్తి-డుంబ్రిగూడ:మండలంలోని కురిడి పంచాయతీ సనత్‌నగర్ గ్రామంలో వితంతు, నిరుపేద మహిళలకు మానవ హక్కుల నేర నిరోధక సంఘం రాష్ట్ర ఏజెన్సీ మహిళ విభాగ అధ్యక్షురాలు కృష్ణకుమారి, అల్లూరి జిల్లా అధ్యక్షుడు పి.ధర్మ ఆధ్వర్యంలో శనివారం నిత్యావసర సరుకులు, చీరలను ఉచితంగా పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ, నిరుపేద మహిళలకు ఉదార భావంతో సేవలందించాలన్న లక్ష్యంతో గిరిజన గ్రామాల్లో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు, ఆ గ్రామస్తులు పాల్గొన్నారు.










