Sep 04,2023 22:22

ఫొటో : మాట్లాడుతున్న ఎపి రైతు సంఘం జిల్లా కార్యదర్శి మూలి వెంగయ్య

నిత్యావసర ధరలు తగ్గించాలి : సిపిఎం
ప్రజాశక్తి-మర్రిపాడు : సిపిఎం కేంద్ర కమిటీ పిలుపుమేరకు పెంచిన నిత్యవసర ధరలు తగ్గించాలని సోమవారం సిపిఎం నాయకులు తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎపి రైతు సంఘం జిల్లా కార్యదర్శి మూలి వెంగయ్య పాల్గొని మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సామాన్యుల నడ్డి విరిచేలా పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ నిత్యావసర ధరలు ఆకాశాన్నంటాయని, పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని ఆయన డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వం 2014 ఎన్నికల సమయంలో అధికారంలోకి రాక ముందురూ రూ.400 ఉన్న గ్యాస్‌ ధర బిజెపి అధికారంలోకి రాగానే రూ.1200 పెంచారన్నారు. గతంలో నిత్యావసర వస్తువులను తక్కువ ధరలకు కొనుగోలు చేస్తుండగా నేడు పేదలకు దూరమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.
గత కొన్ని ఏళ్ల క్రిందట వాడుకున్న విద్యుత్‌ ఛార్జీలను కట్టలేక పోవడంతో నేడు రూ.100 నుండి రూ.400 వరకు పెంచారన్నారు. దీనికి తోడుగా సర్వీస్‌ ఛార్జీ కస్టమర్‌ ఛార్జీలు విద్యుత్‌ సుంఖం లాంటి పేర్లతో మరోభారం ప్రజలపై మోపారని, 2016-19 సంవత్సరంలో వాడిన కరెంటుకు ట్రూఅప్‌ ఛార్జీల పేరుతో బిల్లులు విధిస్తున్నారన్నారు. కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి రహంతుల్లా, సిఐటియు మండల కార్యదర్శి రత్నయ్య, ఐద్వా మండల అధ్యక్ష కార్యదర్శులు శ్యామలమ్మ, మూలి ప్రమీల, నందవరం సిపిఎం సీనియర్‌ నాయకులు మహమ్మద్‌ గౌస్‌, సుధాకర్‌, సీనియర్‌ నాయకులు సూర్యనారాయణ, ఖాజాహుస్సేన్‌, ఖాజావలీ తదితరులు పాల్గొన్నారు.