నిత్యావసర ధరలను తగ్గించాలి : సిపిఎం
ప్రజాశక్తి-కావలి రూరల్ : సిపిఎం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు పెరిగిన నిత్యావసర ధరలు కరెంటు చార్జీలు ఇంటి పన్ను చెత్త పన్ను ఛార్జీలను తగ్గించాలని కోరుతూ శుక్రవారం 17వ వార్డు హరిజనవాడ గిరిజన కాలనీ ఏరియాల్లో కరపత్రాలను పంచుతూ పోరుయాత్రను నిర్వహించారు. అనంతరం బుడంగుంట 15వ నెంబర్ సచివాలయంలో అడ్మిన్ పెంచల బాబుకి అర్జీనిచ్చారు. సందర్భంగా సిపిఎం పట్టణ కార్యదర్శి పసుపులేటి పెంచలయ్య మాట్లాడుతూ పెరిగిన ధరలతో ప్రజలు అల్లాడిపోతున్నారని కొని తినలేని పరిస్థితిలో పేదలు ఉన్నారని ధరలు తగ్గించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు. కేంద్ర ప్రభుత్వం కొన్ని భారాలను ప్రజలపై మోపితే రాష్ట్ర ప్రభుత్వం మరికొన్ని భారాలను ప్రజలపై మోపిందని ఈ బారాలతో ప్రజలు సతమతమవుతున్నారని తెలిపారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు భోగిశెట్టి కిష్టయ్య, పసుపులేటి శ్రీనివాసులు, తలపల రత్నం, పసుపులేటి పెంచల నరసింహం, కార్యకర్తల పాల్గొన్నారు.










