ప్రజాశక్తి-చీమకుర్తి: దీక్షలు చేపట్టిన అయ్యప్ప, భవానీ, శివ స్వాములకు నిత్య అన్నదాన కార్యక్రమాన్ని మాజీ మంత్రి శిద్దా రాఘవరావు లక్ష్మీ పద్మావతి దంపతులు, శిద్దా సుధీర్‌కుమార్ శృతి దంపతులు ఆదివారం లాంఛనంగా ప్రారంభిం చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 30 ఏళ్లుగా శిద్దా వెంకటేశ్వర్లు వెంకటసుబ్బమ్మ ట్రస్టు ఆధ్వర్యంలో దీక్షలో ఉన్న స్వాములకు నిత్య అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అంతకుముందు శిద్దా రాఘవరావు లక్ష్మీపద్మావతి దంపతుల ఆధ్వర్యంలో అయ్యప్ప కలశ ప్రతిష్ట కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఆదివారం స్థానిక హరిహర క్షేత్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శిద్దా రాఘవరావు, లక్ష్మీ పద్మావతి దంపతులను, టిటిడి బోర్డు డైరక్టర్ శిద్దా సుధీర్‌కుమార్ శృతి దంపతులను ఆలయ వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయ సముదాయంలో విశేష పూజలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అయ్యప్ప కలశప్రతిష్ట చేశారు. అభిషేకాలు నిర్వహించారు. మహాగణపతి పూజ, గంగపూజ, మండపాధన, నవగ్రహ పూజ నిర్వహించారు. అనంతరం ఈ ఏడాది కూడా జనవరి నెల వరకు అన్నదానం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సాయంత్రం అయ్యప్ప మహాపడి భజన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ప్రముఖ వేద పండితులు రామకృష్ణశాస్త్రి అయ్యప్ప కలశప్రతిష్ట కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో శిద్దా ట్రస్టు సభ్యులు శిద్దా వెంకటేశ్వర్లు, బొమ్మిశెట్టి శ్రీనివాసరావు, శిద్దా పాండురంగారావు దంపతులు, శిద్దా సురేష్, శిద్దా సుధాకర్ దంపతులు శిద్దా బాలాజీ, శిద్దా పెదబాబు, శిద్దా సాయిబాబు, శిద్దా వెంకటాంజనేయ ప్రసాద్, జ్యోతి గ్రానైట్ ఎక్స్‌పోర్ట్సు సిఈఓ శివరామ్, బొమ్మిశెట్టి రవికిరణ్, చల్లగండ్ల హనుమంతరావు, గ్రంధి శ్రీహరి, నూకల సురేంద్ర, అయ్యప్ప, భవానీ స్వాములు పాల్గొన్నారు.