పజాశక్తి-చీరాల: దక్షణ భారత దేశంలో కమ్యూనిస్టు పార్టీ నిర్మాత కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య నిస్వార్థ ప్రజా సేవకుడని సీపీఎం రాష్ట్రా కార్యవర్గ సభ్యులు డి రమాదేవి అన్నారు. శుక్రవారం సుందరయ్య 38వ వర్థంతి సభ చీరాల బాపనమ్మ కల్యాణ మండపంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పలువురు సిపిఎం నాయకులు సుందరయ్య చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రమాదేవి మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర శాసనసభ నేతగా, పార్లమెంట్ నేతగా ప్రజా సమస్యలపై స్పష్టమైన అవగాహనతో చట్టసభల్లో చర్చకు పెట్టారని అన్నారు. రాజకీయాలలో ప్రజాప్రతినిధిగా సమస్యలపై పూర్తి అవగాహన కలిగిన నేత అని అన్నారు. స్వాతంత్య్ర సమరయోధుడిగా పోరాటాలో ముందుండి నడిచారని అన్నారు. వ్యవసాయ కార్మికుల సమస్యల మీద నిర్దిష్టమైన అవగాహనతో సంఘాలు ఏర్పాటు చేసి సమస్యలు పరిష్కారం కోసం కృషి చేశారని అన్నారు. సుందరయ్య స్ఫూర్తితో ప్రజా సమస్యలపై పోరాడాలని పిలుపునిచ్చారు. సభకు సిపిఎం నాయకులు ఎం వసంతరావు అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో సిపిఎం చీరాల కార్యదర్శి ఎన్ బాబురావు, సిపిఎం నాయకులు పి కొండయ్య, ఎల్ జయరాజు, డీ నారపరెడ్డి, కె ఎల్లమంద, రాజా, బి సుబ్బారావు, అదిశంకరయ్య, భాస్కర్, ఐటిసి నాయకులు సుధీర్, పి కాలేష్, సిహెచ్ శివరాజ్, శివనాడియన్ తదితరులు పాల్గొన్నారు.
కొల్లూరు: కొల్లూరు మండల పరిధిలోని అనంతవరం గ్రామంలో కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 38వ వర్థంతి సభ జరిగింది. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బొనిగల సుబ్బారావు మాట్లాడుతూ దక్షిణ భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీ నిర్మాతగా ఆంధ్ర రాష్ట్ర శాసనసభ పార్లమెంటు నేతగా ప్రజా సమస్యలపై పోరాడిన ప్రజా ప్రతినిధిగా పుచ్చలపల్లి సుందరయ్య నిలుస్తాడని అన్నారు. స్వాతంత్య్ర సమరయోధుడిగా పోరాటంలో ముందుండి నడిపించారన్నారు. కుల సమస్యల మీద అంటరానితనాన్ని నిర్మూలించడంలో నిరంతరం పోరా టం చేశారన్నారు. పుచ్చలపల్లి సుందరయ్య మొట్టమొదటి కూలి సంఘాన్ని ఏర్పాటు చేసి కూలీలు సమస్యలను పరిష్కరించడంలో అహర్నిశలు కృషి చేశారన్నారు.










